ప‌వ‌న్ వ‌చ్చాడు.. క‌దిలాడు.. వాళ్లు అడ్ర‌స్ లేరు

March 29, 2020

అనుమానాస్ప‌ద స్థితిలో మృతి చెందిన క‌ర్నూలు విద్యార్థిని సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ కొన్ని నెల‌లుగా గ‌ళం విప్పుతున్నాడు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఊరికే మాట‌ల‌కు ప‌రిమితం కాకుండా ఆమెకు న్యాయం చేయాల‌న్న డిమాండ్‌తో బుధ‌వారం క‌ర్నూలు ప‌ర్య‌ట‌న‌కు కూడా సిద్ధ‌మ‌య్యాడు. ఐతే క‌ర్నూలులో ర్యాలీ గురించి ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి దాన్ని స‌జావుగా సాగ‌నివ్వ‌కూడ‌ద‌న్న ఉద్దేశంతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ ఎత్తులు వేస్తోంది. ప‌వ‌న్ మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న‌ను వ్య‌తిరేకించ‌డాన్ని ప్ర‌స్తావిస్తూ క‌ర్నూల‌కు హైకోర్టుకు రావ‌డాన్ని ఆయ‌న వ్య‌తిరేకించాడ‌ని, ఆయ‌న రాయ‌ల‌సీమ ద్రోహి అని పేర్కొంటూ విద్యార్థుల జేఏసీ.. ఆయ‌న ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకుంటామ‌ని ఘ‌నంగా ప్ర‌క‌ట‌న‌లు చేశారు.

ప‌వ‌న్‌ను క‌ర్నూలులో అడుగే పెట్ట‌నివ్వ‌మ‌ని.. ఆయ‌న‌కు తీవ్ర ప్ర‌తిఘ‌ట‌న త‌ప్ప‌ద‌ని ఘ‌నంగా ప్ర‌క‌టించిన జేఏసీ.. తీరా ప‌వ‌న్ ర్యాలీ మొద‌ల‌య్యే స‌మ‌యానికి ప‌త్తా లేకుండా పోయింది. జ‌న‌సేన‌కు క‌ర్నూలులో ఏమాత్రం బ‌లం ఉందిలే అనుకున్న‌ట్లున్నారు కానీ.. ప‌వ‌న్ ర్యాలీ కోసం వేలాదిగా కుర్రాళ్లు త‌ర‌లివ‌చ్చారు. జ‌న‌సైనికులతో పాటు ప‌వ‌న్ సినీ ఫ్యాన్స్, సుగాలి ప్రీతికి న్యాయం జ‌ర‌గాల‌ని కోరుకుంటున్న సామాన్య జ‌నం కూడా తోడ‌వ‌డంతో క‌ర్నూలు వీధులు కిక్కిరిసిపోయాయి. ఎక్క‌డ చూసినా భారీగా జ‌నం క‌నిపిస్తుండ‌టంతో జేఏసీకి ఏం చేయాలో పాలుపోయిన‌ట్లు లేదు. ప‌వ‌న్‌ను ఆప‌డం అసాధ్య‌మ‌ని తేలిపోవ‌డంతో జేఏసీ అడ్ర‌స్ లేకుండా పోయింది. ప‌వ‌న్ వ‌చ్చాడు. జ‌నాల‌తో క‌లిసి క‌దిలాడు. సుగాలి ప్రీతి కోసం గ‌ట్టిగా గ‌ళం విప్పాడు. ర్యాలీ సూప‌ర్ స‌క్సెస్ అయింది.