వైసీపీ నేతతో సినిమాలు ఓకే చేసిన పవన్

August 03, 2020

జనసేన అభిమానులకు చేదు వార్త. ఏపీలో ఇటీవల వైకాపా పట్ల పవన్ ధోరణి పూర్తిగా మారిపోతోంది. ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రతిపక్షంలో ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ శభాష్ అని అభినందిస్తున్నాడు.

పవన్ అభిమానులు కూడా జగన్ పార్టీ కలిసి పనిచేయాలని అనుకునేవారు లేకపోలేదు.

అది ఎన్నటికి జరగదు అని ఎన్నిక ముందు అందరూ అనుకున్నారు.

కానీ ఇప్పటికే పవన్ జగన్ తో దోస్తీ చేసిని బీజేపీతో కలిశారు. ఫ్రెండుకు ఫ్రెండు ఫ్రెండే కదా. 

మరోవైపు ఆర్థికంగా బాగా బలహీనపడ్డ పవన్ కళ్యాణ్ కాస్త దూకుడు తగ్గించుకుని తాత్కాలికంగా సినిమాలపై దృష్టిపెట్టారు.

ఇంతకీ పవన్ తాజాగా ఏం నిర్ణయం తీసుకున్నారు అంటే.. వైసీపీ నేతతో వరుస సినిమాలు చేయబోతున్నారు. ఆయన ఎవరో కాదు ప్రసాద్ వి పొట్లూరి.

భారీ సినిమాలు తీసే పొట్లూరి పవన్ తో భారీ సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది.

టాలీవుడ్లో కాంపిటీటర్ లేని స్టార్ గా పవన్ కొనసాగుతున్నాడు. అతని సినిమాలకు కాంపిటీషన్ గా రావడానికి ఎవరూ పెద్దగా ప్రయత్నం చేయరు.

చిరంజీవి స్థాయిలో మళ్లీ పవన్ ఫాలోయింగ్ ఉంటోంది.

సినిమాలు మానేసి మళ్లీ వచ్చినా పవన్ క్రేజు తగ్గలేదు. అతనితో సినిమాలు చేయడానికి నిర్మాతలు, కొనడానికి బయ్యర్లు రెడీగా ఉన్నారు. 

రెండేళ్ల లోపు 7-8 సినిమాలు పూర్తి చేయాలని పనవ్ లక్ష్యంగా పెట్టుకున్నారు.

వకీల్ సాబ్, హరీష్ శంకర్ సినిమా, బాబీతో, త్రివిక్రమ్ తో కూడా సినిమాలు చేస్తున్నారు.

క్రిష్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నారు.

ఎంతో మంది నిర్మాతలు ఉండగా వైసీపీ నేతతో సినిమాలు తీయాల్సిన అవసరం పవన్ కు ఎందుకు వచ్చిందనే ప్రశ్న తలెత్తుతోంది.

ఏమో ఆయనకేం ఉద్దేశం ఉందో ఏమో !