ఈనాడు మొద‌టి పేజీ ఫొటో... జ‌గ‌న్‌కు టెర్ర‌ర్

February 24, 2020

ద‌ళితులు... ఆర్థికంగా ఎదిగినా ఇంకా ఒక ర‌క‌మైన వివ‌క్ష‌కు గుర‌వుతున్నారు. అయితే మునుప‌టిలా ఇది బ‌హిరంగంగా లేక‌పోవ‌చ్చు. కానీ వారు గౌర‌వం కోసం ఇంకా వేచి చూస్తూనే ఉన్నారు. దేశంలో ద‌ళితుడు రాష్ట్రప‌తి అవ‌డం వారికి సంతృప్తిని ఇవ్వ‌లేదు. కానీ మ‌హిళ‌ల‌నే చిన్న‌చూపు చూసే రాష్ట్రంలో అది కూడా దేశ రాజ‌కీయాల‌ను శాసించే రాష్ట్రంలో ఒక సాధార‌ణ ద‌ళిత మ‌హిళ సింహ‌స్వ‌ప్న‌మై ఎదిగి అన్ని వ‌ర్గాల‌ను ఆక‌ట్టుకుని ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అధిరోహించింది. ఆమే... మాయావ‌తి. ఈరోజు ప్ర‌ధాని రేసులో ఉంది. ఎవ‌రో స‌హ‌క‌రిస్తే ఎదిగిన వ్య‌క్తి కాదు. స్వ‌యంశ‌క్తితో ఎదిగిన వ్య‌క్తి.
ఆమె గురించి ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ ఆమె ఒక స్ఫూర్తి అన్నారు. నిజ‌మే క‌చ్చితంగా స్ఫూర్తే. ఆమె కేవ‌లం ముఖ్య‌మంత్రి అవ‌డ‌మే కాదు... ఆధునిక న‌గ‌రం నోయిడా సృష్టిక‌ర్త‌ల్లో ఆమె ఒక‌రు. అందుకే దేశంలో ద‌ళితులకు మాయావ‌తి అంటే ఒక చిహ్నం. ఆమెలో ఆత్మ‌గౌర‌వాన్ని చూసుకుంటారు.
ఇపుడు మాయావ‌తి ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయ భాగ‌స్వామి. 2019 ఎన్నిక‌ల్లో ఆమెతో పాటు క‌మ్యూనిస్టుల‌తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ పొత్తు పెట్టుకోవ‌డం సాధార‌ణ వ్యూహం కాదు. జ‌గ‌న్‌కు పెద్ద ఎత్తున అండ‌గా నిలిచిన ద‌ళితులు ఒక్క‌సారిగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వైపు చూసేలా చేసిన ఓ ఘ‌ట‌న వీరిద్ద‌రి మ‌ధ్య జ‌రిగింది. చ‌ట్ట‌ప‌రంగా ఓ అగ్ర‌కులంగా వెలుగుతున్న కాపు సామాజిక వ‌ర్గం ప్ర‌తినిధిగా భావిస్తున్న ప‌వ‌న్ నిండు స‌భ‌లో మాయావ‌తికి పాదాభివందనం చేశారు. అది ఈనాడు మొద‌టి పేజీలో ఒక కోటి మంది చూశారు. ఇది ఒక అనూహ్య‌మైన అడుగు. ఎవ‌రో ఒక‌రి మీద ఆధార‌ప‌డ‌టం ఏంటి... ఇపుడు మాకు ఓ పార్టీ ఉంది, అది కూడా మ‌మ్మ‌ల్ని త‌మ కంటే ఉన్న‌తంగా చూసే పార్టీ ఉంది.... అంటూ ఆ వ‌ర్గం జ‌న‌సేన వైపు తిరిగి చూసే ప‌రిస్థితి ఉంది. దీంతో త‌మ ఓటు బ్యాంకు బీటలు వారుతోంద‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర‌మైన ఆందోళ‌న‌లో ఉంది. పైగా మాయావ‌తి రెండు రోజుల పాటు ఏపీలో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తు ద‌ళిత యువ‌కుల‌ను ఏకం చేస్తోంది. వారిని ప‌వ‌న్ వైపు ప‌య‌నింప‌జేస్తోంది.