మొహమాటం వదిలేసిన పవన్... మోడీ గురించి

August 08, 2020

ప్రధాని నరేంద్ర మోదీ సెకండ్ టర్మ్ పాలనకు నేటి ఏడాది పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మోడీని అభినందించారు. నరేంద్ర మోడీ ఏడాది పాలన అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. ఒక్క ఏడాదిలోనే ఎన్నో చరిత్రాత్మకమైన దిక్సూచిలా నిలిచే ఉత్తమ నిర్ణయాలు తీసుకున్నారని మోడీని పొగడ్తల్లో ముంచెత్తారు. 

ప్రధాని మోడీ తీసుకున్న సంచలన నిర్ణయాలతో త్వరలో భారతదేశం స్వయం సమృద్ధి సాధించిబోతోందని ఆత్మవిశ్వాసం వెలిబుచ్చారు. ప్రధాని మోదీ వంటి ధైర్యసాహసాలు, దూరదృష్టి ఉన్న నాయకుడి నేతృత్వంలో 21వ శతాబ్దం భారతదేశానిది కానుందని విశ్వాసం వెలిబుచ్చారు.

A year that saw historic and landmark decisions in the country; And now our ‘Bharath’ shall soon become a Self-Reliant Nation. The 21st century shall truly belong to ‘India ‘ under the visionary and courageous leadership of Hon. PM Sri

@narendramodi ji  My Hearty Congratulations!! to everyone in the govt for 1 year of bold and successful reforms. Jai Hind !

ఇది పవన్ చేసిన ట్వీట్.  2019లో ఎన్నికల్లో 300 కి పైగా సీట్లతో నరేంద్ర మోడీ రెండో సారి అఖండ మెజారిటీతో గెలిచారు.  23 మే నెల ఫలితాలు రాగా... 2019 మే 30న ఎన్డీయే పక్ష నేతగా నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశారు. నేటితో ఏడాది గడిచింది. 

అయితే... పవన్ ట్వీట్ పై విమర్శలు వస్తున్నాయి. మోడీని కీర్తించడం పవన్ ఇష్టం కావచ్చు. కానీ పవన్ చెప్పినవి అబద్ధం అని... అభివృద్ధి వెనక్కు పయనించిందని, తిరోగమనం దిశగా ఇండియా నడుస్తోందని... వలస కూలీల విషయంలో ప్రభుత్వ డొల్లతనం అర్థమైందని ఇలాంటి సమయంలో మోడీని కీర్తించడం పవన్ కు మైనస్ అవుతుంది గాని ప్లస్ కాదు అంటున్నారు విశ్లేషకులు.

క.రో‘నా విషయంలో మోడీ సర్కారు డిజాస్టర్ అయ్యిందంటున్నారు. 20 లక్షల కోట్ల ప్యాకేజీ బోగస్ ప్యాకేజీ అని ప్రపంచమంతటా ఈ ప్యాకేజ్ ని చీల్చిచెండాడిన విషయాన్ని పవన్ గుర్తుపెట్టుకోవాలని అంటున్నారు.