జ‌గ‌న్‌పై ప‌వ‌న్ స‌టైర్లు..  రాజధాని పులివెందుల అయితే బెటర్

April 03, 2020

జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్... ప్ర‌భుత్వంపైనా, సీఎం జ‌గ‌న్‌పైనా ఎన్నిక‌ల‌కు ముందు ఎలాంటి వైఖ‌రితో ఉన్నాడో.. ఇప్పుడు కూడా అదే వైఖ‌రితో విజృంభిస్తున్న విష‌యం తెలిసిందే. తండ్రి సీఎం అయితే, కొడుకు కూడా సీఎం కావాలా? అంటూ ఎన్నిక‌ల‌కు ముందు ప్ర‌శ్నించిన ప‌వ‌న్‌.. త‌ర్వాత కూడా అనేక రూపాల్లో జ‌గ‌న్‌పై విరుచుకుప‌డిన సంగ‌తి గుర్తిండే ఉంటుంది. ఇక‌, ఇటీవ‌ల విశాఖ‌లో నిర్వ‌హించిన విశాఖ లాంగ్ మార్చ్‌లో కూడా ప్ర‌భుత్వంపై స‌టైర్లు కుమ్మేశాడు. జ‌గ‌న్‌పై త‌న‌కు వ్య‌క్తిగ‌త ద్వేషం లేదంటూనే ఆయ న‌పై  విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించాడు. ఇసుకే ఇవ్వ‌లేని ప్ర‌భుత్వం.. మ‌న‌కు అవ‌స‌ర‌మా? అంటూ విమ‌ర్శించాడు.
కూల్చివేత‌ల‌తో ప్రారంభ‌మైన ప్ర‌భుత్వం కూడా కూలిపోతుందంటూ.. త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇక‌, విశాఖ లాంగ్ మార్చ్‌లో ప్ర‌భుత్వానికి రెండు వారాల డెడ్‌లైన్ కూడా విధించారు. రెండు వారాల్లోనే ఇసుక‌ను అందుబాటులోకి తేవాలంటూ.. ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగాడు. ఇక‌, తాజాగా విశాఖ‌, శ్రీకాకుళం విజ‌య‌న‌గ‌రం జిల్లాల పార్టీ కార్య‌క‌ర్త‌లు, నేత‌ల‌తో స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న ప‌వ‌న్‌.. పార్టీ భ‌విత‌వ్యం, చేయాల్సిన కార్య‌క్ర‌మాలు, వ్యూహాల‌పై కార్య‌క‌ర్త‌ల‌కు దిశానిర్దేశం చేస్తున్నారు.
ఈ క్ర‌మంలోనే ఆయ‌న కార్య‌క‌ర్త‌ల‌తో ప‌రిచ‌య కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా కూడా జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌లు, వ్యంగ్యాస్త్రాల‌ను సంధిస్తూ.. స‌టైర్ల‌తో అభిమానుల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేశాడు ప‌వ‌న్‌. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిపై ప్ర‌భుత్వం ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌ని నేప‌థ్యంలో దీనిపై నెల‌కొన్ని అయోమ‌యాన్ని ప్ర‌స్థావించిన ప‌వ‌న్‌.. దీనిని పులివెందులకు మార్చుకోండి! అంటూ జ‌గ‌న్‌పై వ్యంగ్యాస్త్రం సంధించారు. అంతేకాదు, హైకోర్టు విష‌యాన్ని కూడా ప్ర‌స్థావించిన ప‌వ‌న్‌.. ఇప్ప‌టికే దీనిని క‌ర్నూలులో ఏర్పాటు చేయాల‌నే డిమాండ్ ఉన్న నేప‌థ్యాన్ని చెబుతూనే, దీనిని కూడా అక్క‌డికే మార్చుకోండి.. మీకు ప్ర‌తి శుక్ర‌వారం హాజ‌ర‌య్యేందుకు అనువుగా ఉంటుంద‌ని మ‌రో స‌టైర్ తో కుమ్మేశాడు.
అదే స‌మ‌యంలో జ‌గ‌న్ లాయ‌ర్లు చెబుతున్న‌ట్టు సీఎం హోదాలో ఉన్న‌జ‌గ‌న్ కోర్టుకు హాజ‌ర‌య్యేందుకు ఖ‌ర్చు ఎక్కువ అవుతున్న విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ.. క‌ర్నూలులో కోర్టు ఏర్పాటుతో ఈ ఖ‌ర్చు కూడా త‌గ్గుతుంద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించాడు. ఇక‌, ప్ర‌తిభా పుర‌స్కారాల‌కు వైఎస్సార్ పేరు పెట్ట‌డం, మాజీ రాష్ట్ర‌ప‌తి క‌లాం పేరును ప‌క్క‌న పెట్ట‌డాన్ని ప‌వ‌న్ దెప్పిపొడిచారు. ఈ విష‌యంలో జ‌గ‌న్ అమాయ‌కుడిగా మాట్లాడుతున్నార‌ని, త‌న‌కు తెలియ‌కుండానే ఓ ప‌థ‌కం పేరును ఎవ‌రైనా మారుస్తారా? అంటూ ప్ర‌శ్నించారు. అయితే, దీనికి బాధ్యుడైన అధికారిపై వేటు వేయాల‌ని ఆయ‌న సూచించారు. ఇలా మొత్తంగా ప‌వ‌న్‌.. జ‌గ‌న్‌పై అటు ఎన్నిక‌ల‌కు ముందు, ఇటు ఎన్నిక‌ల త‌ర్వాత కూడా స‌టైర్లు వేయ‌డం ఆస‌క్తిగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.