జగన్ పై పవన్ సంచలన కామెంట్స్

February 25, 2020

పుట్టెడు కేసులు ఉన్నవారు ముఖ్యమంత్రి అయితే... ఫలితం ఇలాగే ఉంటుంది. తన క్షేమం కోసం రాష్ట్ర ప్రయోజనాలు పణంగా పెట్టకతప్పదు. రాష్ట్ర ముఖ్యమంత్రికి కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ దొరకకపోవడం ఏంటి? దానిపై మౌనంగా ఉండటం ఏంటి... ఇలాంటివి వింటే...బాధ కలుగుతుంది. ’’మనమీద కేసులు ఉన్నపుడు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటానికి ధైర్యం సరిపోెదు. నామీద కేసులు ఉంటే... నాకంటే పెద్ద పవర్ చేతిలో ఉన్న వారితో నేను గట్టిగా మాట్లాడగలనా? లేదు. ఇలాంటి సీఎం వల్ల రాష్ట్రానికి న్యాయం కలగడం అనేది అనుమానమే’’ అంటూ పవన్ కళ్యాణ్ జగన్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

రాష్ట్రంలో పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. అధికార పార్టీ వ్యవహరించే తీరు చూస్తుంటే... మిగతా 20 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తే 150 మంది కలిసి కొడతారేమో అని అనుమానం వచ్చేలా ఉన్నాయి రాష్ట్రంలో పరిస్థితులు. ప్రతిపక్షంలో ఉన్నపుడు జగన్ ... తన బాబాయి హత్య కేసు విచారణకు డిమాండ్ చేశారు. సీబీఐ విచారణ అడిగారు. మరి ఇపుడు ఆయన సీఎం అయ్యారు. సైలెంటైపోయారు. మరి జనాలకు అనుమానాలు వస్తాయి ఎందుకు అని. అలాగే వైజాగ్ ఎయిర్ పోర్టులో తన పై దాడి జరిగిన కేసులో కూడా ఏ పురోగతి లేదంటే... ఆ దాడి వెనుక కారణాలు ప్రజలు రకరకాలుగా విశ్లేషిస్తారని అన్నారు. 

వరుసగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో తన పార్టీ శ్రేణులతో పవన్ మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రకాశం జిల్లా జనసేన సమావేశం జరిగింది. దీనికి హాజరైన పవన్ కళ్యాణ్ స్తానిక నేతలు ప్రజా సమస్యలపై పాదయాత్రలు చేయాలన్నారు. తాను కూడా ఒక రోజు మీతో కలిసి పాదయాత్ర చేస్తాను అన్నారు.