వైసీపీ వారి తలలు నరుకతామనడం కరెక్టే - పవన్ సంచలనం

August 07, 2020

నేను రాజకీయం చేయడం మొదలుపెడితే ఇంకోలా ఉంటుంది అని పవన్ గతంలో రెండు మూడుసార్లు వ్యాఖ్యానించాడు. అతను తాను చెప్పినట్లే గట్టి రాజకీయం మొదలుపెట్టినట్లు ఉంది. ఇది ఇపుడు పెద్ద రచ్చ అయ్యింది. పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటనలో భాగంగా మదన పల్లికి వెళ్లినపుడు అక్కడ జనసన నేత సాకే పవన్... సంచలన వ్యాఖ్యలు చేశాడు.  పవన్ కళ్యాణ్ సరే అంటే... వైసీపీ నేతల తలలు నరుకుతాం అని అతను వ్యాఖ్యానించారు. దీనిని వైసీపీ తీవ్రంగా పరగణించింది. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాకే  పవన్ తరఫున పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నోటా అన్ని ఓట్లు కూడా రాని వ్యక్తి ఎలా పడితే అలా మాట్లాడతారా? అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పలు ఇతర వైసీపీ నేతలు కూడా ఇలాంటి డిమాండే వినిపించారు. వాటన్నింటికీ పవన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. 

సాకే పవన్ అన్నమాటలు ఆవేదనతో వచ్చినవే అన్నారు. సాకే పవన్ ను ఎన్నోసార్లు రాప్తాడులో వేధించారని, అందుకే అతను అలా మాట్లాడాడని అన్నారు. తలలు తీస్తానంటే కేసులు పెడతారా? మరి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ... ‘‘చంద్రబాబును నడిరోడ్డులో ఉరితీయాలి‘‘ అని జగన్ అన్నమాటలపై ఏం కేసు పెట్టారు అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అప్పట్లో జగన్ పై ఏ కేసు పెట్టారో, ఇపుడు సాకే పవన్ పై అదే కేసుపెట్టాలని అన్నారు. అనంతపురం జిల్లాలో వైసీపీ శ్రేణుల అరాచకాలు, అఘాయిత్యాలు, ఆగడాలు ఎక్కువయ్యాయని అన్నారు. అన్నిటికీ తగిన సమాధానం వస్తుందన్నారు. 

పవన్ కళ్యాణ్ స్పందనతో జనసేన క్యాడర్ ఫుల్ ఖుషీ అయ్యింది. మాకు అన్న దన్నుగా ఉన్నాడన్న భరోసాను జనసేన వాళ్లు ఎక్స్ ప్రెస్ చేస్తున్నారు.