ప‌వ‌న్ వ్యాఖ్య‌లు వింటే జ‌గ‌న్ త‌ల ఎక్క‌డ పెట్టుకుంటాడో

September 17, 2019

రాజ‌కీయాల్లో నిందారోప‌ణ‌లు మామూలే. అయితే.. ప్ర‌తి దానికి ఒక ప‌రిమితి ఉంటుంది. దూకుడు రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థిని గౌర‌వించాలి.. మ‌ర్యాద‌గా విమ‌ర్శ‌లు చేయాల‌న్న వాటిని ప‌క్క‌న పెట్టేసి.. ఎంత మాట ప‌డితే అంత మాట అనేయ‌టం ఒక అల‌వాటుగా మారింది. అలాంటి సంస్కృతికి రూపంలా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ మాట‌లు ఉంటున్నాయి.
త‌న ప్ర‌త్య‌ర్థుల‌పై మాట‌ల‌తో వెనుకా ముందు చూసుకోకుండా విరుచుకుప‌డే అల‌వాటున్న ఏపీ విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి తాజాగా ఇబ్బందిక‌ర ప‌రిస్థితి నెలకొంద‌ని చెప్పాలి. తాను మాట అన‌ట‌మే కానీ.. తాను మాట ప‌డ‌టం త‌క్కువ అన్న‌ట్లుగా ఉండే జ‌గ‌న్ కు.. తాజాగా జ‌న‌సేన అధినేత నోటి నుంచి వ‌స్తున్న తూటాల్లాంటి మాట‌లు జ‌గ‌న్ కు శ‌రాఘాతంగా మార‌తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇవాల్టి రోజున చంద్ర‌బాబును తిట్ట‌టం ఒక అల‌వాటుగా మారింది. అదే జ‌గ‌న్ ను.. ఆయ‌న లోని లోపాల్ని.. ఆయ‌న చేసే లోగుట్టు రాజ‌కీయాల్ని బ‌య‌ట‌కు తెచ్చి.. బజారులో నిల‌బెట్టి మాట‌ల‌తో క‌డిగేయ‌టం లాంటివి ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రూ చేయ‌లేదు.
ఆ లోటును తీరుస్తూ ప‌వ‌న్ ఒక రేంజ్లో విరుచుకుప‌డుతున్నారు. తాజాగా గోదావ‌రి జిల్లాల్లో నిర్వ‌హించిన భారీ స‌భ‌ల్లో ఆయ‌న జ‌గ‌న్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ వేసే బిస్కెట్ల‌ను ఏరుకోవ‌టానికి జ‌గ‌న్ వెంప‌ర్లాడుతున్నార‌ని.. ఆయ‌న‌కు ఆత్మాభిమానం లేదా? అని ప్ర‌శ్నిస్తున్నారు.
ఎక్క‌డ జ‌గ‌న్ ను ట‌చ్ చేస్తే ఆయ‌న ఇట్టే క‌నెక్ట్ అవుతారన్న విష‌యం త‌న‌కు తెలుస‌న్న‌ట్లుగా ప‌వ‌న్ తాజాగా పులివెందుల మాట‌ను తెర మీద‌కు తెచ్చారు. ఇదేనా పులివెందుల పౌరుషం? జ‌గ‌న్ కు అస‌లు పౌరుష‌మే లేదా? ఛీ.. ప్ర‌త్యేక హోదా కోసం పోరాడ‌కుండా అమిత్ షా కాళ్ల మీద ప‌డ‌ట‌మా? ఆంధ్రుల హ‌క్కుల్ని కాల‌రాస్తున్నారు? అంటూ ఫైర్ అయ్యారు.
చ‌ట్ట‌స‌భ‌లంటే జ‌గ‌న్ కు గౌర‌వం లేద‌ని.. స‌భ‌ల‌కు హాజ‌రు కాని ఆయ‌న తీరును ప‌వ‌న్ దుయ్య‌బ‌ట్టారు. పాద‌యాత్ర‌ల పేరుతో గ‌డ్డాలు ప‌ట్టుకోవ‌టం త‌ప్పించి చేసిందేమీ లేద‌ని తేల్చేసిన వ‌ప‌న్.. ఇలాంటి వ్య‌క్తి రాష్ట్రానికి ఏం చేస్తారంటూ సూటిగా ప్ర‌శ్నించారు. తండ్రి పేరు చెప్పుకొని పెట్టిన పార్టీ జ‌గ‌న్ ద‌న్న ఆయ‌న‌.. ఆంధ్రుల హ‌క్కుల్ని తెలంగాణ‌లో కాల రాస్తుంటే ఒక్క‌రూ మాట్లాడ‌ని ప‌రిస్థితి లేద‌ని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు.
నేత‌లెవ‌రూ ఆంధ్రుల హ‌క్కుల గురించి మాట్లాడ‌క‌పోవ‌టానికి కార‌ణం హైద‌రాబాద్‌లో వారి ఆస్తులు ఉండిపోవ‌టమేన‌ని చెప్పిన ప‌వ‌న్‌.. ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వం కోస‌మే జ‌న‌సేన ప‌ని చేస్తుంద‌న్నారు. కేసీఆర్ ఆంధ్రుల‌ను తిడుతుంటే..జ‌గ‌న్ ఆయన వేసే బిస్కెట్ల కోసం వెంప‌ర్లాడుతున్నారేకానీ.. నోరు విప్పి మాట్లాడ‌టం లేద‌ని మండిప‌డ్డారు. రెండేళ్లు జైల్లో ఉన్న వ్య‌క్తి రాష్ట్రానికి ఏం చేస్తారంటూ సూటిగా ప్ర‌శ్నిస్తున్న ప‌వ‌న్ మాట‌లు చూస్తే.. జ‌గ‌న్ ను ఈ స్థాయిలో.. ఇంత తీవ్రంగా ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రూ తిట్ట‌లేద‌ని చెప్పాలి. త‌న‌ను ఇన్ని మాట‌లు అంటున్న ప‌వ‌న్ పై జ‌గ‌న్ ఎలా రియాక్ట్ అవుతార‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.