పవన్ కళ్యాణ్ కి సర్జరీ !?

February 23, 2020

మీడియా పట్ల ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా జర్నలిస్టులు ఉద్యమిస్తున్నారు. గత నాలుగు నెలల్లో మీడియా వారిపై దాడులు, నిషేధాలు జరిగాయి. దీనిని మీడియా తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర కీలకమైనదని .. దానిని అణచివేయడం కరెక్టు కాదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. 

ఇకపోతే ఈరోజు వారు విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటుచేశారు. దీనికి పవన్ కళ్యాణ్ ని ఆహ్వానించారు. అయితే, దానికి పవన్ హాజరు కాలేదు. పార్టీ ప్రతినిధులను పంపారు. దీనికి పవన్ సారీ చెబుతూ వ్యక్తిగత సందేశం విడుదల చేశారు. 

అనారోగ్యం వల్ల తాను హాజరు కాలేకపోతున్నానని, వెన్ను నొప్పితో బాధపడుతున్నానని పవన్ తెలిపారు. గబ్బర్ సింగ్ సమయంలో గాయాలు అయ్యాయని, అవి పూర్తిగా మానలేదు, నేను కూడా సరిగా శ్రద్ధ తీసుకోలేదు అని పవన్ చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా తిరగడం వల్ల వెన్నునొప్పి పెరిగినట్టు పవన్ చెప్పారు. ఇపుడు మూడు రోజులుగా విశ్రాంతిలో ఉన్నాను, తాను ఇంగ్లిష్ వైద్యం వాడటం లేదని, సంప్రదాయ వైద్యాన్ని నమ్ముకుంటున్నానని పవన్ వెల్లడించారు. సర్జరీ అవసరం అని డాక్టరు సూచించినా... తాను చేయించుకోవడం లేదని చెప్పారు.