సర్ ప్రైజ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

February 23, 2020

జనసేన అధ్యక్షుడు పవన్ ఈరోజు ఉత్తరాదిన సర్ ప్రైజ్ విజిట్ జరిపారు. స్వామి నిగమానంద సమాధి ఉన్న మాత్రి సదన్ ఆశ్రమాన్ని ఆయన ఈరోజు సందర్శించారు. ఈ ఆశ్రమం హరిద్వార్ శివారులో గంగా నది సమీపంలో ఉంది. డెహ్రాడూన్ కు ఫ్లైట్ ద్వారా చేరుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా హరిద్వార్ చేరుకున్నారు. అనంతరం స్వామి శివానంద్ మహరాజ్ తో చాలాసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. గంగానదిలో పూజలు చేశారు. ఆశ్రమ సంప్రదాయంలో తలపాగా ధరించి ఈ పూజల్లో పాల్గొన్నారు. 

ప్రకృతి కార్యక్రమాల్లో పాల్గొనడానికి ముందుండే పవన్ కళ్యాణ్ సేవ్ నల్లమల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈరోజు పర్యటనలో గంగా నది పరిరక్షణ గురించి ఆయన మాట్లాడారు. గంగా నదిని కలుషితం చేయడం అంటే... నీటిని కలుషితం చేయడం కాదు, మన సంస్కృతిని కలుషితం చేయడం అన్నారు. ఈ ఆశ్రమానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆశ్రమంలో సమాధి అయిన నిగమానంద ఎవరో కాదు... గంగా నది ప్రక్షాళన కోసం 115 రోజు నిరాహార దీక్ష చేసిన ప్రాణాలు వదిలిన యోధుడు. అందుకే అప్పటి నుంచి గంగా ప్రక్షాళన నిరసనలకు ఇది ఒక వేదికగా నిలుస్తోంది. 

పవన్ కళ్యాణ్ తో పాటు ఈ కార్యక్రమంలో ఒక స్పెషల్ పర్సన్ పాల్గొన్నారు. ఆయన ఎవరో కాదు... వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొంది మెగసెసే అవార్డు అందుకున్న శ్రీ రాజేంద్రసింగ్. ఎడారిలో నీటికి అడ్రస్ చూపించిన ప్రకృతి మనిషి రాజేంద్రసింగ్.