YCP-JSP : గెలిచినోడి పరువు పోతే... ఓడినోడికి ప్రశంసలు !!

February 26, 2020
CTYPE html>
నిజమే... గెలిచి పరువు పోగొట్టుకున్న నేత ఒకరైతే... ఓడి ప్రశంసలు అందుకుంటున్న నేత మరొకరు. అది కూడా ఈ ఇద్దరు నేతలు కూడా తెలుగు నేలకు చెందిన వారే. అంతేనా... ఇద్దరూ తమ తమ రంగాల్లో ఓ వెలుగు వెలిగి రాజకీయాాల్లోకి వచ్చిన వారే. అంతేనా... ఇద్దరూ మొన్నటి ఎన్నికల్లో కొత్తగా బరిలోకి దిగిన వారే. అందుకే... ఈ ఇద్దరు నేతల మధ్య  కాంట్రాస్టు... కాంట్రాస్టులకే కాంట్రాస్టుగా మారిందని చెప్పక తప్పదు. మొత్తంగా బిగ్గెస్ట్ కాంట్రాస్టు నేతలుగా నిలిచిన వీరిద్దరికి సంబంధించిన అంశం ఆసక్తికరంగా మారిపోయింది. 
సరే మరి...  అసలు విషయంలోకి వెళ్లిపోదామా? టీడీపీ జమానాలో అనంతపురం జిల్లాలో ఓ సర్కిల్ ఇన్ స్సెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న గోరంట్ల మాధవ్... నాటి అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి సవాల్ విసిరి ఒక్కసారిగా హీరో అయిపోయారు. ఇంకేముంది... సీఐ పదవికి రాజీనామా చేసి పారేసి నేరుగా రాజకీయాల్లోకి వచ్చి నాటి విపక్ష వైసీపీలో చేరిపోయారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈయనకు జగన్ మంచి ప్రాధాన్యమే ఇచ్చి... హిందూపురం ఎంపీ టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. ఇంతదాకా బాగానే ఉన్నా.... ఇప్పుడు దిశ హత్యాచారం,  నిందితుల ఎన్ కౌంటర్ నేపథ్యంలోొ దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న వేళ... ఉద్యోగిగా ఉండి హీరోగా గుర్తింపు పొంది రాజకీయాల్లోకి వచ్చి ఎంపీగా గెలిచిన మాధవ్ పై ఓ రేప్ కేసు ఉందన్న విషయం ఇప్పుడు అందరినీ షాక్ కు గురి చేసింది. మొత్తంగా ఎన్నికల్లో గెలిచినా... రేప్ కేసుతో మాధవ్ తన పరువును తానే తీసేసుకున్నారు.
ఇక టాలీవుడ్ లో పవర్ స్టార్ గా ఓ రేంజి సంపాదించుకుని ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి జనసేన పేరిట సొంత పార్టీని ఏర్పాటు చేసుకుని ఎన్నికల్లో చితికిలబడిన పవన్ కల్యాణ్ పై ఇప్పుడు సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఏకంగా రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసిన పవన్... రెండు చోట్లా ఓటమిపాలయ్యారు. ఇక తన పార్టీ తరఫున వందకు పైగా అభ్యర్థులను బరిలో నిలిపితే... కేవలం ఒక్కరంటే ఒక్కరు మాత్రమే విజయం సాధించారు. ఆ విజయం కూడా పవన్ మేనియాతో కాకుండా సదరు అభ్యర్థి స్టామినాగానే విశ్లేషణలు వెలువడ్డాయి. ఎన్నికల్లో ఘోర ఓటమితో చాలా రోజుల పాటు బయటకే రాని పవన్... ఇప్పుడు ఏపీలో అధికార పక్షానికి చుక్కలు చూపిస్తున్నారు. అదే సమయంలో నిన్న ఆయన తీసుకున్న ఓ నిర్ణయం... ఆయనకు దక్కిన ఓటమిని జనం మరిచిపోలా చేసింది. అంతేకాకుండా జనం చేత ఆయనకు జేజేలు కొట్టిస్తోంది. అదేంటంటే... దేశం కోసం ప్రాణాలనే పణంగా పెడుతున్న సైనికుల సంక్షేమ నిధికి పవన్ ఏకంగా రూ.1 కోటి విరాళాన్ని అందజేశారు. 
మొత్తంగా మొన్నటి ఎన్నికల్లో అనూహ్యంగా రెండు చోట్లా ఓటమిపాలైన పవన్ సైనికుల సంక్షేమ నిధికి విరాళం ద్వారా జనం చేత జేజేలు కొట్టించుకుంటూ ఉంటే... అందుకు విరుద్ధంగా తొలి బరిలోనే విక్టరీ కొట్టిన మాధవ్... తనపై ఉన్న అత్యాచారం కేసు కారణంగా తన పరువును తానే తీసుకున్నారు. అంటే... ఓడినా ఒకే ఒక్క నిర్ణయంతో జనంతో జేజేలు కొట్టించుకున్న నేతగా పవన్, గెలిచినా తనపై ఉన్న ఒకే ఒక్క మరకతో మాధవ్ పరువు పోగగొట్టుకున్న నేతగా నిలిచారన్న మాట. ఇంతటి కాంట్రాస్టు ఉన్నందుకే ఈ అంశం ఇంత ఆసక్తి రేకెత్తించింది.