వైర‌ల్ పిక్స్.. ప‌వ‌న్‌కు క‌ళ‌క‌ళ‌.. జ‌గ‌న్‌కు వెల‌వెల‌

February 25, 2020
CTYPE html>
శ‌నివారం నాటి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైజాగ్ ప‌ర్య‌ట‌న గురించి వారం రోజుల ముందు నుంచే హ‌డావుడి న‌డుస్తోంది. మూడు రాజ‌ధానుల ప్ర‌తిపాద‌న చేసి, విశాఖ‌ను ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్‌గా జ‌గ‌న్‌ ప్ర‌క‌ట‌న చేసిన త‌ర్వాత ఆ న‌గ‌రంలో ఆయ‌న చేసిన తొలి ప‌ర్య‌ట‌న ఇది. సీఎంకు క‌నీవినీ ఎరుగ‌ని స్వాగ‌తం ప‌ల‌కాలంటూ వైకాపా ఆగ్ర‌నేత విజ‌య‌సాయిరెడ్డి ఈ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీల‌కు దిశానిర్దేశం చేస్తూ భారీ ఎత్తున స‌న్నాహాలు చేయిస్తున్న‌ట్లు వార్త‌లొచ్చాయి. అధికారంలో లేన‌పుడే జ‌గ‌న్ స‌భ‌లు, కార్య‌క్ర‌మాల‌కు భారీగా జ‌నాలొచ్చేవాళ్లు. ఇప్పుడిక సీఎంగా, అది కూడా విశాఖ‌ను రాజ‌ధానిగా ప్ర‌క‌టించాక ప‌ర్య‌ట‌న అన‌గానే జ‌న‌సందోహం గురించి వైకాపా వాళ్లు భారీగానే అంచ‌నా వేశారు.
కానీ ఆశ్చ‌ర్య‌క‌రంగా జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌కు జ‌నాల నుంచి ఆశించిన స్పంద‌న క‌ర‌వైంది. అక్క‌డ‌క్క‌డా అభిమానులు, కార్య‌క‌ర్త‌లు గుంపులుగా క‌నిపించారు కానీ.. దారి పొడ‌వునా కిక్కిరిసి స్వాగ‌తం ప‌లుకుతార‌న్న విజ‌య‌సాయిరెడ్డి అంచ‌నాలు ఫ‌లించ‌లేదు. వైజాగ్ ప్ర‌ధాన రోడ్లు, ఫ్లైఓవ‌ర్లు జ‌నాలు లేక బోసిపోతుండ‌గా.. సీఎం కాన్వాయ్ మామూలుగా సాగిపోయింది. ఐతే రెండు నెల‌ల కింద‌ట ఇదే వైజాగ్‌లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇసుక కొర‌త‌కు వ్య‌తిరేకంగా మార్చ్ పాస్ట్ నిర్వ‌హిస్తే ల‌క్ష‌ల మందితో వైజాగ్ రోడ్లు కిక్కిరిసిపోయాయి. ఫ్లైఓవ‌ర్ల కిందా, పైనా ఇస‌కేస్తే రాల‌నంత జ‌నం క‌నిపించారు. దీంతో అప్ప‌టి ప‌వ‌న్ కార్య‌క్ర‌మంలో జ‌నాల‌తో నిండిన రోడ్లు.. ఇప్పుడు జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ఖాళీగా క‌నిపిస్తున్న రోడ్ల ఫొటోల‌ను పోలుస్తూ జ‌న‌సైనికులు ట్విట్ట‌ర్‌లో హోరెత్తించేస్తున్నారు.