అభిమానులను తిట్టిన పవన్.. వీడియో వైరల్

February 21, 2020

ఒకే ఇష్యూని ఒక్కొక్కరు ఒక్కోరకంగా డీల్ చేస్తారు. సభలో జనాలు అరుస్తుంటే... తనదైన మాండలికంలో చెప్పికేసీఆర్ కంట్రోల్ చేస్తారు. జగన్ అయితే... దానిని ఎంజాయ్ చేస్తూ ఊరికే ఉంటారు కాసేపు. అదే చంద్రబాబు అయితే... ఏ బాబు ఊరుకో, అంటూ ఓ రకమైన సీరియస్ ఎక్స్ ప్రెషన్ తో చెబుతాడు. మరి ఈరోజు పవన్ ఏం చేశాడో తెలుసా? అభిమానులను వీర తిట్టుడు తిట్టాడు. తన అభిమానుల్లో ఏం లేదో దానిని గట్టిగా నొక్కి చెప్పి మరీ తిట్టాడు. 

తూర్పుగోదావ‌రి జిల్లా మండ‌పేట‌లో నిర్వ‌హించిన రైతు స‌ద‌స్సుకు పవన్ హాజరయ్యాడు.  ఈ సందర్బంగా ఆసక్తికరమైన ప‌రిణామం చోటు చేసుకుంది. భారీగా జనసేన కార్యకర్తలు హాజరయిన ఈ సభలో ఒకవైపు పవన్ మాట్లాడుంటే మరో వైపు అభిమానులు అల్లరి చేస్తూనే ఉన్నారు. దీంతో పవన్ కు కోపం వ‌చ్చింది. ఉగ్గబట్టుకోలేక జనసైనికులపై ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ’’మీతో ఇదే ప్రాబ్లం. మీలో క్రమశిక్షణ లేకే నేను ఓడిపోయాను. అన్నం పెట్టే రైతు కష్టాలు చెబుతున్నపుడు మీరు అరుస్తుంటే నాకు ఎలా వినిపిస్తుంది? నిజంగా ఇబ్బందిగా ఉంది. క్రమశిక్షణ లేకపోతే మీరేం చేయలేరు. మీరు సరిగా లేకపోవడం వల్లే నేను 2019లో ఓడిపోవాల్సి వచ్చింది.. అది మర్చిపోకండి. క్రమశిక్షణ ఉండుంటే.. జనసేన గెలిచి ఉండేది’’ అంటూ పాత బాధను పవన్‌ గట్టిగా చెప్పారు. 

పవన్ నుంచి వచ్చిన ఊహించని రియాక్షన్ కు అభిమానులు ఒకసారి స్టన్నయ్యారు. పవన్ అరిచాక సైలెంట్ అయ్యారు.