వైసీపీ కాలగర్భంలో కలిసిపోతుంది

August 06, 2020

వైసీపీ నేతలు నోరు తెరిస్తే వారి నోటి నుంచి తిట్లు మాత్రమే వస్తున్నాయి. వారు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మాకు తిట్లు రావా? మేము తెలుగు మీడియంలో చదువుకోలేదా? తిట్లు తిట్టాలంటే మాకు సంస్కారం అడ్డు వస్తుంది. మిడిసి పడకండి. ప్రతిఒక్కరూ కాలగర్భంలో కలిసిపోతారు. అదేవిధంగా వైసీపీ కూడా కాలగర్భంలో కలిసిపోతుంది ... ఇది పవన్ కళ్యాణ్ కాకినాడలో నిర్వహించిన రైతు సౌభాగ్య దీక్షలో భాగంగా చేసిన ఉద్వేగపూరిత ప్రసంగం. 

వైసీపీ నేతలకు పద్ధతి పాడు లేదు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తిట్లు మాత్రమే వారి నోటి నుంచి వస్తున్నాయి. ఏ ప్రశ్నకు సమాధానం చెప్పుకోలేకపోతన్నారు. నేను వీధిబడిలో చదువుకున్నవాడిని. నాకు మీకంటే ఘోరమైన తిట్లు వచ్చు. కానీ దానికింకా సమయం ఉంది. సామదానబేధదండోపాయాలున్నాయి. ఒక్కో దశ దాటుకుంటూ వెళ్తాను. మంచి పద్ధతుల్లో చెబితే వినకపోతే అపుడు బాహాబాహీకి అయినా సిద్ధం. తిడితే భరిస్తాం, ఛీకొట్టినా భరిస్తాం... మాకు టైం వచ్చేంతవరకే. అది వచ్చిన రోజు... మీకు జీవితం ఏంటో అంటే తెలుస్తుంది భస్మీపటలం అవుతారు. ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోయినట్లే మీరు కూడా కలిసిపోతారు  అంటూ పవన్ నేరుగా వార్నింగ్ ఇచ్చారు.