రియ‌ల్ గోపాలుడిగా ప‌వ‌న్‌

August 15, 2020

పవన్ కల్యాణ్....ఒకప్పుడు సినిమాలు, ఇప్పుడు రాజకీయాల్లో బిజీగా ఉన్న కథా’నాయకుడు’. అయితే తాను ఎంత బిజీగా ఉన్నా తన అలసట తీర్చుకునేది మాత్రం ఒక్క ప్రకృతి వడిలోనే. ఎన్ని సమస్యలు ఉన్న హైదరాబాద్ లోనే తన వ్యవసాయక్షేత్రంలోనే సేద తీరుతారు.  అక్కడ ఉన్న పచ్చని చెట్లు, గోవులు మధ్యలోనే గడుపుతారు. అదే ఆయనకి ఊరటనిస్తుంది. బయట ఎంత క్రేజ్ ఉన్న...ఇక్కడ మాత్రం సామాన్యుడిలా జీవితం గడుపుతూ..ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తారు. త‌న వ్య‌వ‌సాయ క్షేత్రంలో పండించిన పండ్ల‌ను ఎన్నో సార్లు హీరోల‌కు పంపారు.

ఈ క్రమంలోనే పవన్ తన వ్యవసాయ క్షేత్రం నుంచే మరో బృహత్తరమైన కార్యక్రమం చేపట్టారు. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా ‘వనరక్షణ’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా  తన వ్యవసాయ క్షేత్రం పరిసరాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ శాస్త్రోక్తంగా ప్రారంభించారు. వన రక్షణ కార్యక్రమానికి ముందు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. మొదట భూమాతను పూజించి పృథ్వీ సూక్తం పఠించి మొక్కలు నాటే కార్యక్రమానికి అంకురార్పణ చేశారు.
ఇక ఈ వనరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఊరూరా చేపట్టాలన్నారు. ప్రతి జనసేన నాయకుడు, సైనికుడు ఈ బృహత్తర కార్యక్రమంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. కేవలం మొక్కలు నాటడం మాత్రమే కాదు వాటిని పెంచి సంరక్షించాలని కోరారు. అలాగే కార్తీక మాసంలో నిర్వహించే వనభోజనాలు... కుల భోజనాలు కాకూడదని విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాలు వన సంరక్షణలో భాగం కావాలని పవన్ కోరారు.
ఈ వనసంరక్షణ కార్యక్రమం సందర్భంగా పవన్ తన వ్యవసాయ క్షేత్రంలో మొక్కలు నాటి...కాసేపు ప్రకృతి, పశువులు మధ్య ప్రశాంతంగా గడిపారు. అలాగే పవన్ కార్తికమాస దీక్షను కూడా చేపట్టారు. ఈ కార్తీక మాసం మొత్తం పవన్ ఘనాహారం స్వీకరించకుండా...కేవలం ద్రవాహారం మాత్రమే తీసుకొనున్నారు.