PSPK28: మరో సారి ఫ్యాన్ కి ఛాన్సిచ్చిన పీకే

February 18, 2020

నిన్న అధికారికంగా సినిమాల్లోకి రీఎంట్రీ ప్రకటించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా కొత్త అప్ డేట్ ఈరోజు వచ్చేసింది. పీకే 28వ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. పవన్ ను ఎలా చూడాలనుకుంటామో అలాగే చూపిస్తాను.. ఎందుకంటే నేను పవన్ అభిమానిని. ఒక అభిమానిగా మా హీరో తెరపై ఎలా కనపడాలో నాకు తెలుసు అంటూ అప్పట్లో హరీష్ చేసిన వ్యాఖ్య ఇంకా ఎవరూ మర్చిపోలేదు. గబ్బర్ సింగ్ పవన్ స్టైల్ కి నిజంగానే పర్ ఫెక్ట్ సినిమా. పవన్ రేంజ్ ను పది రెట్లు పెంచిన సినిమా అది. 

తాజాగా హరీష్ సామర్థ్యాన్ని నమ్మి పవన్ కళ్యాణ్ మరో పెద్ద బాధ్యతను అతనిపై పెట్టారు. 28వ సినిమాకు హరీష్ దర్శకుడు.  ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. మరిన్ని విషయాలు మరియు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తారు. హీరోయిన్ ను కూడా ఇంకా ఎంపిక చేయాల్సి ఉంది.