ప‌వ‌న్ పాత వీడియో ఎందుకు వైర‌ల్ అయ్యింది

February 25, 2020

ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయ ప‌రిజ్ఞానం గురించి ప్ర‌త్య‌ర్థులు  త‌ర‌చుగా విమ‌ర్శ‌లు చేస్తుంటారు. కానీ కొన్ని సంద‌ర్భాల్లో ఆయ‌న అవ‌గాహ‌న‌, ప‌రిజ్ఞానం, దూర‌దృష్టి చూస్తే ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. ఇందుకు తాజా ఉదాహ‌ర‌ణ ట్విట్ట‌ర్లో ప‌వ‌న్ పెట్టిన ఒక వీడియో. 2015లో అమ‌రావ‌తి ప్రాంతంలో ప‌ర్య‌టిస్తూ త‌ర్వాతి ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ గెల‌వ‌ని ప‌క్షంలో రాజ‌ధాని కోసం భూములిచ్చిన రైతుల ప‌రిస్థితి ఏంటంటూ ప‌వ‌న్ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తూ మాట్లాడిన మాట‌లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశం అవుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే ప‌వ‌న్ ఎంత దూర‌దృష్టితో మాట్లాడుతాడో అర్థం చేసుకోవ‌చ్చు. ఇంత‌కీ ఆ వీడియోలో ప‌వ‌న్ ఏమ‌న్నాడంటే..
‘‘రాజధాని ప్రాంత వేలాదిమంది రైతులు వాళ్ల నమ్మకాన్ని, విశ్వాసాన్ని.. పిల్లల భవిష్యత్‌ను టీడీపీ ప్రభుత్వం చేతిలో పెడుతున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వ రాకపోతే అప్పటికి నారాయణ, పత్తిపాటి పుల్లారావు ఉండరు. అలాంటి పరిస్థితుల్లో (టీడీపీ ప్రభుత్వం మళ్లీ రాని పక్షంలో) భూములు ఇచ్చిన రైతులకు గ్యారెంట్ ఏంటి.. రైతులు నమ్మి ఇస్తున్నారు.. ఎవర్ని నమ్మి ఇస్తున్నారు.. ఒకవేళ ఈ ప్రభుత్వం రాకపోతే లిఖితపూర్వకంగా లేకపోతే వాళ్ల పరిస్థితి ఏంటి. తాను తీసే సినిమాలకే తాను జవాబుదారీగా ఉంటే.. మరి ప్రభుత్వాలు ఎలాంటి బాధ్యతతో ఉండాలి. అధికారిక ధ్రువీకరణ పత్రం లేకపోతే రైతులకు నష్టం జరుగుతుంది. అధికారిక పత్రాలు, శాసనాల ద్వారా జరిగితేనే..రైతులు ఇబ్బంది పడుకుండా ఉంటారు. అలా లిఖితపూర్వకంగానే ఇచ్చినప్పుడే నమ్మకం ఉంటుంది’’ అని ప‌వ‌న్ అప్పుడు అన్నాడు.