పవన్ రాజకీయ వ్యూహం అదిరింది

July 15, 2020

పవన్ కళ్యాణ్... ఏపీ గవర్నర్ హరిచందన్ ను కలిశారు. ఇసుక కార్మికుల కష్టాలు చూడమని, స్పందించమని... వారిని కష్టపెట్టిన జగన్ ను మందలించి వారికి పని దొరికేలా ప్రభుత్వాన్ని ఆదేశించమని పవన్ కళ్యాణ్ గవర్నర్ ను కోరారు. ఇదంతా బానే ఉంది. కానీ... జగన్ పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగత విమర్శలతో దాడి చేసిన మరుసటి రోజే గవర్నర్ ను పవన్ ఎందుకు కలిశాడు. దీని వెనుక వ్యూహం ఏంటి? 

వాస్తవానికి ఈరోజు జగన్, చంద్రబాబుల కంటే తెలివిగా స్పందించారు పవన్ కళ్యాణ్. జగన్ పవన్ మీద చేసిన విమర్శల వల్ల పవన్ కి కించిత్ నష్టం కూడా కలగదు. ఎందుకంటే జగన్ స్వయానా చెల్లెలు చట్టబద్ధంగా ఒకరికి విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకున్నారు. పవన్ ఇద్దరికి చట్టబద్ధంగా విడాకులు ఇచ్చి మరో పెళ్లి చేసుకున్నారు. ఇందులో పెద్ద డిఫరెన్సు ఏం లేదు. అయితే... జగన్ తనపై వ్యక్తిగతం దాడి చేసి తన విలువను తగ్గించుకుంటే... అదే రోజు ప్రజల సమస్య గురించి పవన్ కళ్యాణ్ గవర్నర్ కు ఫిర్యాదు చేయడం ద్వారా నా ప్రాముఖ్యత ప్రజలే కానీ... వాళ్లు వీళ్లు చేసే విమర్శలు కాదు అన్న సందేశాన్ని జనాలకు, అతన అభిమానులకు పంపించారు పవన్ కళ్యాణ్. 

అదేసమయంలో జగన్ తాను దిగజారి చేసిన వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ చాలా తెలివైన కౌంటర్ ఇచ్చారు. మీరు మాపై వ్యక్తిగత దాడికి దిగినంత మాత్రాన మేము సమస్యల నుంచి పక్కకు దృష్టి మళ్లిస్తాం అనుకుంటారేమో... అదంతా ట్రాష్. మా దృష్టి మొత్తం ప్రజల సమస్యల మీదనే అంటూ పవన్ చాలా వ్యూహాత్మకంగా స్పందించారు. 

మీడియా సమావేశంలో కూడా ఇంగ్లిష్ మీడియం ని పూర్తిగా వ్యతిరేకించకుండా... ప్రభుత్వం పూర్తిగా ఉపాధ్యాయులను సిద్ధం చేయకుండా ఇంగ్లిష్ మీడియం పెట్టడం మాత్రమే పవన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్ని స్కూళ్లను ఇంగ్లిష్ మీడియం చేయండి కానీ దానివల్ల తెలుగు నష్టం రాకుండా, విద్యార్ధులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నది మా డిమాండ్ అంటూ చాలా చక్కగా స్పందించారు పవన్ కళ్యాణ్. 

పవన్ ఈరోజు వ్యవహరించిన తీరులో మంచి పరిణితి కనిపించింది. తన అభిమానులు నడవాల్సిన దారిని కూడా పవన్ సరిచేసినట్లయ్యింది. మనల్ని ట్రాప్ లో వేయడానికి ఇతర పార్టీలు ప్రయత్నించినా... చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఎదగాలన్న సందేశాన్ని గట్టిగా వెల్లడించారు పవన్ కళ్యాణ్.