పవన్ ఉద్యమ పిలుపు... పార్టీలు కదిలొస్తాయా?

February 23, 2020

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజ‌కీయ పార్టీల‌ను ఒకేతాటిపైకి వచ్చేనా.. ?  ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన ఈ ట్వీట్‌తో ఎన్ని రాజ‌కీయ పార్టీలు క‌లిసొస్తాయో తెలియ‌దు కానీ.. రాబోయే రోజుల్లో ఇదో ఐక్య ఉద్య‌మాల‌కు పునాది కానుంది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసి ట్వీట్ ఇలా ఉంది.  

The recent suicides  of construction workers have shaken up my conscience.
As responsible Political parties we must all come together in their support and make the Government understand the pain and anguish of the suffering people are being subjected to by a lopsided policy. 

వాస్త‌వానికి ఏపీలో ఇసుక కొర‌త తీవ్రంగా ఉంది. ఇసుక కొర‌తకు కార‌ణాలు లేక‌పోలేదు. ఇసుక అందుబాటులో ఉన్న‌ప్పుడు ఏపీ ప్ర‌భుత్వం నూత‌న ఇసుక పాల‌సీ తీసుకురావ‌డానికి స‌మ‌యం తీసుకుంది. ఇసుక పాల‌సీ తేగానే రాష్ట్రంలో భారీ వర్షాలు రావ‌డం, కృష్ణా, గోదావ‌రి న‌దుల్లో భారీగా వ‌ర‌ద‌లు రావ‌డం ఇసుక కొర‌త తీవ్ర త‌రం అయింది. ఇసుక కొర‌త‌తో ఏపీలో నిర్మాణ ప‌నులు ఎక్క‌డి అక్క‌డే ఆగిపోయాయి. ఇసుక కొర‌త వ‌ల్ల‌ అనేక మంది భ‌వ‌న నిర్మాణ కార్మికులు ప‌నులు లేక ఉపాధి దొర‌క‌క, వేరే ప‌నులు చేసుకోలేక ఇబ్బందులు ప‌డుతున్నారు.
రోజు కూలీ చేసుకుంటే బ‌తికే కుటుంబాల జీవ‌నం కుంటుప‌డింది. దీంతో భ‌వ‌న‌నిర్మాణ కార్మికుల కుటుంబాలు అప్పులు చేయ‌లేక‌, కుటుంబాల‌ను పోషించుకోలేక గ‌త్యంత‌రం లేక‌  ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు. భ‌వ‌న నిర్మాణ కార్మికులు ఆత్మ‌హ‌త్య‌లే శ‌ర‌ణ్యం అనే స్థితిలోకి నెట్ట‌బ‌డ‌టం తీవ్ర‌మైన అన్యాయ‌మే. అయితే కార్మికులు కూడా క్ష‌ణికావేశంతో ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుని కుటుంబాల‌ను వీధిపాలు చేసేకంటే ఆత్మ స్థైర్యంతో బ‌తికితే రాబోవు రోజుల్లో బ‌తుకుకు భ‌రోసా దొరుకుతుంది.
అయితే ఇప్పుడు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌కు అండ‌గా, ప్ర‌భుత్వానికి భ‌న‌వ నిర్మాణ కార్మికుల జీవ‌న స్థితిగ‌తుల‌ను తెలిసేలా చేసేందుకు అన్ని రాజ‌కీయ పార్టీలు క‌లిసి రావాల‌ని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో ఇసుక కొర‌త‌మీద అన్ని రాజ‌కీయ పార్టీలు ఒకేతాటి మీద‌కు క‌లిసివ‌స్తే ఉద్య‌మిస్తే ఏపీ స‌ర్కారు భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌కు న్యాయం దొరుకుతుంద‌ని జ‌న‌సేనాని ఆశ‌. ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసి ఈ విజ్ఞ‌ప్తికి ఏరాజ‌కీయ పార్టీలు స్పందించి జ‌న‌సేన‌తో క‌లిసి వ‌స్తాయో.