ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏపీలో తలకిందులు కావడం ముఖ్యకారణం జనసేన ఈ పార్టీ వల్ల అంచనాలు సరిగా వెయ్యలేకపోయారు. సాధారణంగా మూడో పార్టీ పోటీలో ఉంటే ఇలాంట ఇబ్బంది సాధారణం.
2019 ఏపీ ఎన్నికలనే తీసుకుంటే... 25 ఎంపీ సీట్లలో 3 టీడీపీకి వచ్చాయి. 22 వైసీపీకి వచ్చాయి. అయితే, వైసీపీకి దక్కిన 22 సీట్లలో 7 ఎంపీ సీట్లు జనసేన వల్ల టీడీపీ మిస్సయ్యిందంటున్నారు ఆ పార్టీ శ్రేణులు. అంటే... వీరి లెక్క ప్రకారం జనసేనకు వచ్చిన ఓట్లన్నీ జనసేన లేకుంటే తమకే పడేవి అన్నట్లు ఉంది. మరి అలా జరుగుతుందని ఎవరు మాత్రం చెప్పగలరు.
సరే ఆ ఏడు సీట్లు ఎవరివో చూద్దాం.
నియోజకవర్గం ^^ జగన్ పార్టీ అభ్యర్థి మెజార్టీ ^^ జనసేనకు పోలైన ఓట్లు
అమలాపురం 34,494 2,51,584
కాకినాడ 26,294 1,32,124
బాపట్ల 15,881 41,816(బీఎస్పీ)
మచిలీపట్నం 57,608 1,12,416
నరసాపురం 28,093 2,48,144
రాజమహేంద్రపురం 1,18,218 1,55,025
విశాఖపట్నం 3722 2,77,971