జగన్ కి నిద్రపట్టనివ్వని పవన్

February 26, 2020

ఏపీలో ప్రతిపక్షం టీడీపీ. కానీ వారికంటే ఒక్క ఎమ్మెల్యే గెలిచిన జనసేన పార్టీ అధినేత పవన్ అధికార పార్టీని, ముఖ్యమంత్రి జగన్ ను ఎక్కువగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలపైనే కాకుండా జగన్ చరిత్రను కూడా తవ్వితీసి వెంటాడుతున్నారు. జగన్ పాలనపై ఆరునెలలు ముగిసిన అనంతరం పవన్ స్పందించిన తీరు టీడీపీ స్పందించిన దాని కంటే కూడా ఘాటుగా ఉంది. ముఖ్యమంత్రి చేసిన ప్రతి పొరపాటును గట్టిగా వివరంగా ప్రశ్నించారు జనసేనాని.

తాజాగా కడప పాలెగాళ్ల రాజ్యం నడిపిస్తున్నాడు జగన్ అన్నట్లు... చరిత్రను తవ్వి ప్రశ్నించారు పవన్. 1996 పౌర హక్కుల వారు కడప, రాయలసీమ పరిస్థితుల, పాలెగాళ్ల అరాచకాల  గురించి ముద్రించిన ఓ పుస్తకాన్ని పవన్ ట్వీట్ చేశారు. దాని గురించి పవన్ ఇలా వ్యాఖ్యానించారు.

‘‘1996 లో పౌరహక్కులు వారు ప్రచురించిన ఈ పుస్తకంలో,అనేక చేదు నిజాలు బయటకి వస్తాయి.రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చిన ఎందుకు దళిత, వెనుకబడిన, మిగతా అన్నికులాల సామాన్య ప్రజలు ఈ ముఠా సంస్కృతి వలన ఎలా నలిగి ,వలసలు వెళ్లి పోతున్నారు, రాయలసీమ వెనుకబాటుకు కారణాలు ఏంటో అవగతమౌతుంది. అలాగే ఈ పుస్తకంలో 75వ పేజీలో శ్రీ జగన్ రెడ్డి గారి ప్రస్తావన కూడా ఉంటుంది.’’
 
book pdf link : https://bit.ly/2XQGOII 
 
వాస్తవానికి పవన్ ఈ స్థాయిలో తిరగబడతాడు అని వైసీపీ ఊహించలేదు. 18 సీట్లు వచ్చిన అన్న రాజకీయం మానేశాడు. ఒక్క సీటు అది కూడా తాను కూడా గెలవలేదని అవమానంతో పవన్ వెనక్కి వెళ్లిపోతాడనుకున్నారు. కానీ పవన్ వ్యవహారం చూస్తుంటే చిరంజీవిలా లేదు. ఎలాగైనా సరే... వైసీపీకి దెబ్బ కొట్టాలి, వారికి ఎదురొడ్డాలన్న దృఢ నిశ్చయంతో పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నట్టున్నారు.
అచ్చం వైసీపీ చేసే రాజకీయాలు టీడీపీకి వంటబట్టలేదు కానీ... వైసీపీ ని వైసీపీ రాజకీయంతోనే ఎదుర్కొనే రాజకీయాన్ని పవన్ బానే వంటబట్టించుకున్నాడు. అందుకే టీడీపీ కంటే కూడా పవన్ ను వైసీపీ నేతలు కొంచెం ఎక్కువ టార్గెట్ చేశారు. ఏదేమైనా... వైసీపీ కి కరెక్టు మొగుడు మా నాయకుడే అని జనసేన నేతలు రొమ్ములు విరుచుకుని తిరుగుతున్నారు. మరి ఈ టెంపో ఎంతకాలం ఉంటుందో చూడాలి. పవన్ కి ప్లస్ పాయింట్ ఏంటంటే... కేసులు పెట్టి వేధించాలని సర్కారు ప్రయత్నంచడానికి కూడా పవన్ కళ్యాణ్ వద్ద ఆ వీక్నెస్ లేదు.