పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్‌లో ప‌వ‌న్‌...!

May 31, 2020

జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఆయ‌న ఓ మెస్సేజ్ ఓరియంటెడ్ సినిమాలో న‌టిస్తాడ‌ని గ‌త కొద్దిరోజులుగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇదే విష‌యాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌ద్ద ప్ర‌స్తావించిన‌ప్పుడు తాను సినిమాల్లో న‌టిస్తానో లేదో ఇంకా త‌న‌కే స్ప‌ష్ట‌త లేద‌ని చెప్పుకొచ్చారు. అయితే నిర్మాత‌గా మారుతాన‌ని మాత్రం వెల్ల‌డించ‌డం విశేషం. ప‌వ‌న్ అలా చెప్పిన‌ప్పటికి ఆయ‌న న‌టించ‌బోయే త‌దుప‌రి సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు స్టార్ట్ అయిన‌ట్లు తెలుస్తోంది. బాలీవుడ్‌లో వ‌చ్చిన పింక్ సినిమా రీమేక్‌లో న‌టిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.
ఈ సినిమాను దిల్‌రాజు, బోనీక‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తుండ‌గా వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ప‌వ‌న్ రీ ఎంట్రీ మూవీపై మ‌రో క‌థ‌నం ప్ర‌చారంలో ఉంది. అదేంటంటే ఆయ‌న పింక్ సినిమా క‌థ‌పై ఆస‌క్తిగా లేర‌ని, ఈ సినిమా సందేశాత్మ‌క కథాంశ‌యే  అయినా ప‌వ‌న్ ప్ర‌స్తుతం పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ చేయాల‌ని యోచిస్తున్నార‌ట‌. ఇదే విష‌యాన్ని త‌న‌కు అత్యంత స‌న్నిహితులైన ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల వ‌ద్ద ప్ర‌స్తావించ‌డంతో వారు మంచి నిర్ణ‌యమ‌ని ప‌వ‌న్‌కే ఓటేశార‌ట‌.
ప‌వ‌న్ ఆలోచ‌న ప్ర‌కారం..  అక్ర‌మాల‌కు తావులేని , అవినీతి ర‌హిత స‌మాజం కోసం పాటుప‌డే ఓ ప్ర‌తిప‌క్ష నేత అధికార పక్షం చేస్తున్న అక్ర‌మాల‌ను బ‌య‌ట‌పెడుతూ జ‌నం మెప్పు పొందుతూ క్లైమాక్స్‌లో విజ‌యం సాధిస్తాడు. ఇది స్థూలంగా ప‌వ‌న్ అనుకుంటున్న క‌థ‌గా తెలుస్తోంది. ఇక ఇలాంటి స్టోరీలో నటించడం. రాజకీయంగానూ తనకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని పవన్ భావిస్తున్నారట.  
వ‌ప‌న్ రీ ఎంట్రీ ప్ర‌స్తావ‌న వ‌చ్చేస‌రికి స‌హ‌జంగానే వివి. వినాయ‌క్‌, పూరీ, రాజ‌మౌళి, కొర‌టాల‌, సురేంద‌ర్‌రెడ్డి ఇలా ప‌లువురు టాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుల పేర్లు వినిపిస్తుండ‌టం గ‌మ‌నార్హం. మ‌రోవైపు త‌నకు అత్యంత స‌న్నిహితుడైన త్రివిక్ర‌మ్ అయితే మూవీపై పాజిటివ్ థాట్ ఉంటుంద‌ని ప‌వ‌న్ ఆయ‌న వైపే మొగ్గు చూపుతున్న‌ట్టు టాక్‌. ఇలాంటి సమయంలో పవన్ ఎప్పుడు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు..? ఏ కథలో నటించబోతున్నాడు..?  లాంటి విషయాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే మ‌రి.