ప‌వ‌న్‌లో ఫైర్ ఉంది, లీడ‌ర్ అవుతాడు

February 27, 2020

ప్ర‌జ‌ల్లో స‌మాన‌త్వం తీసుకురావ‌డ‌మే పార్టీల ల‌క్ష్యం కావాలి... ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉద్దేశం అదే. అందుకోస‌మే అత‌ను జ‌న‌సేన స్థాపించాడు. ప‌వ‌న్ లో ఫైర్‌ ఉంది. స‌మాజానికి మార్గ‌ద‌ర్శ‌నం చేసే లీడ‌ర్ అవుతాడు అని మాయావ‌తి ప‌వ‌న్‌పై ప్ర‌శంస‌లు కురిపించింది. బీఎస్పీతో పొత్తు నేప‌థ్యంలో ఆమె జ‌న‌సేన కూట‌మి త‌ర‌ఫున పోటీచేయ‌డానికి తెలుగు రాష్ట్రాలకు వ‌చ్చారు. వైజాగ్‌లో ప్రెస్ తో మాట్లాడారు.
ప‌వన్ కల్యాణ్ యువకుడు, చిత్తశుద్ధి ఉన్న నాయకుడు... రాష్ట్ర ప్రజలకు ఏదైనా మంచి చేయాలనే తపన‌ ఆయనలో స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. దాన్ని చూసే తాను జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నానని అన్నారు. సినిమా రంగంలో పవన్ కల్యాణ్ నెం.1గా ఎదిగారు, అద్భుతంగా రాణించారు... రాజకీయాల్లో కూడా అదే స్థాయిలో ఎదుగుతారు... అత‌నిలో పోరాట‌ప‌టిమ ఉంది అని మాయావ‌తి అన్నారు. ప‌వ‌న్ మా ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి. అత‌ను గెలుస్తాడు. ద‌ళితులు, ఇత‌ర వ‌ర్గాలు మాతో ఉన్నాయి. కచ్చితంగా విజ‌యం జ‌న‌సేన‌దే అని మాయావ‌తి అన్నారు.

అనంత‌రం ప‌వ‌న్ మాట్లాడారు. దళితుల అభ్యున్నతికి ఒంటరిగా పోరాటం చేస్తున్న రాజకీయ నాయకురాలు మాయావతి మాత్రమే... ఆమెకు పేద‌ల‌కు అండ‌గా ఉంది, మేము ఆమెకు అండ‌గా ఉంటాం అని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. మాయావతిని ప్రధానిని చేయడ‌మే జ‌న‌సేన ఏకైక అజెండా అని ప‌వ‌న్ అన్నారు. యూపీలో మాయావతి చేసిన అభివృద్ది పనులను తాను యూపీలో తిరిగి ప్ర‌చారం చేస్తాన‌ని అన్నారు. 2007లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ బ‌డ్జెట్‌ 45 వేల కోట్లు మాత్ర‌మే. దానిని మాయావతి మూడు లక్ష కోట్ల రూపాయలకు తీసుకెళ్లారు. అదీ ఆమె స‌త్తా. నోయిడాను అద్భుతంగా, మౌలిక వసతులను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. సొంత పార్టీ ఎమ్మెల్యేను కూడా మాయావతి శిక్షించారని, నడిరోడ్డుపై నడిపించారని చెప్పారు. ప్రతిపక్ష నాయకులు తప్పులు చేస్తున్నప్పటికీ.. ఇక్కడ పట్టించుకోవట్లేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఇక్క‌డి నాయ‌కులు ప్ర‌జ‌ల‌ను స‌మ‌స్య‌ల నుంచి దారిమళ్లించి ఎన్నికల ప్రచారంలో బూతులతో విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. దీనివ‌ల్ల ఏం ప్ర‌యోజ‌నం? ఇది సమస్యను పరిష్కరించ‌దు అన్నారు. అందుకే జ‌న‌సేన ఆవిర్భ‌వించింది. ఈ రాజ‌కీయాల్లో మార్పు తెస్తుంది అని ప‌వ‌న్ అన్నారు.