ఈవీఎంలకు విచిత్రమైన టెస్ట్ పెట్టిన శరద్ పవార్

May 27, 2020

మ‌హారాష్ట్ర రాజ‌కీయ వృద్ధ సింహం ప‌వార్ మాట‌లు వైరల్ అవుతున్నాయి. ఈవీఎంలపై ఆయన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు వింటే.. ప‌వార్ లాంటోళ్లు రాజ‌కీయాల‌కు గుడ్ బై చెప్పాల్సిన స‌మ‌యం అసన్న‌మైంద‌న్న భావ‌న క‌ల‌గ‌టం ఖాయం.
నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ.. పొట్టిగా ఎన్సీపీ అధినేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ప‌వార్ కుమార్తె సుప్రియా సులే తాజాగా మ‌హారాష్ట్రలోని బారామ‌తి నుంచి మ‌రోసారి బ‌రిలోకి దిగారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఈవీఎంల‌పై అనుమానాలు వ్య‌క్తం చేస్తూ.. త‌న కుమార్తె ఓడితే.. ప్ర‌జ‌ల‌కు ప్ర‌జాస్వామ్యం మీద న‌మ్మ‌కం పోతుంద‌న్న దారుణ‌మైన వ్యాఖ్య చేశారు. అదే ఈవీఎంల మీద గెలిస్తే మాత్రం.. ఈవీఎంలు ఫెయిల్ కాలేద‌న్న‌ట్లుగా మాట్లాడ‌టంలో అర్థం లేద‌ని చెప్పాలి.
ఈవీఎంల ప‌ని తీరు మీద అనుమానాలు ఉంటే అదే విష‌యాన్ని ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించాలి. అంతేకానీ.. కూతురు గెలిస్తే.. ఈవీఎంలు మంచివని, ఓడితే వాటిల్లో లోపాలు ఉన్న‌ట్లు చెప్పడం పవార్ కే నష్టం. ఒకవేళ మ్యానిపులేట్ చేసే వాళ్లు కూతురు ఈవీఎంలను ముట్టుకోకుండా
ఎన్సీపీ మిగతా అభ్యర్థులవన్నీ మ్యానిపులేట్ చేసి పార్టీలందరినీ ఓడిస్తే అపుడు కూడా పవార్ ఇవే మాటలు అంటాడా? అనగలడా?
బహుశా మోడీ వంటి వారు తన కూతురును ఓడించకుండా ఉండటానికి ఇలాంటి వ్యాఖ్యలు ఉపయోగపడతాయి గానీ... ఒక వేళ అతని కూతురు గెలిస్తే భవిష్యత్తులో ఈవీఎంలై మాట్లాడే అర్హతను కోల్పోతాడు పవార్.