వైసీపీ దొంగవేషాలు కడిగేసిన పయ్యావుల కేశవ్

May 26, 2020

చేతిలో అధికారం ఉన్న వాడికి దొంగ దొరికితే ఊరికే ఉంటాడా? ఉండడు. మరి ఎందుకు తెలుగుదేశం నాయకులు తిన్నారు...తిన్నారు.. తిన్నారు... అని చెబుతూ మా ఆస్తులపై, మా ఒంటిపై చేయివేయలేకపోతున్నారు. ఎందుకంటే.. మా కొనుగోళ్లు తప్పు కాదు. మా ఆస్తులు బినామీ కాదు. మావి అవినీతి ఆస్తులు కావు. అందుకే చేతిలో అధికారం ఉన్నా మీరేమీ చేయలేకపోతున్నారు.... ఇది కేంద్రం కఠినమైన బినామీ చట్టం తెచ్చింది. మీకది గుర్తులేదని అర్థమైంది. ఆ కాపీ పంపుతున్నాను. ఈ చట్టం ప్రకారం తెలుగుదేశం పార్టీకి చెందిన బంధువులు 800 మంది (మీరు చెప్పిన లెక్క) ఆస్తులను వెంటనే జప్తు చేసి ఆ సొమ్మును ఏపీ ఖజానాకు జమ చేసుకోండి. ఇది నా  సవాల్ అంటూ... బుగ్గన బుగ్గలు మాటలతోనే చిదిమేశాడు పయ్యావుల ేకేశవ్. పయ్యావు స్పీచ్ పూర్తిగా ఇక్కడ చూడొచ్చు.