​వంద కోట్ల ప్రజలతో ఛీ కొట్టించుకున్న వైసీపీ ఎంపీ

August 07, 2020

ఆయన ఈ దేశపు శాసన కర్తల్లో ఒకరు. మచిలీపట్నం నుంచి వైసీపీ పార్టీ తరఫున ఎంపీ అయ్యారు. ఈ దేశం ఎదుర్కొన్న సవాళ్లను తనవంతుగా పరిష్కరించాల్సిన ఆ ఎంపీ సిగ్గు వదిలి, అత్యంత బాధ్యతరాహిత్యంగా ప్రవర్తించి ప్రజలందరితో తిట్టించుకున్నారు. అంతేకాదు... చివరకు కోర్టుతో కూడా చీవాట్లు తిన్నారు. గత కొన్ని రోజులుగా వైసీపీ నేతల చేష్టలు జాతీయ మీడియాలో వైరల్ అవడం చూస్తూనే ఉన్నాం. దారుణమైన పరిస్థితుల్లో దేశం చిక్కుకుని విలవిలలాడుతంటే వైద్య రంగం తన భుజాల మీద మోస్తూ దేశాన్ని కాపాడుతుంది. కానీ వైసీపీ నేతలు అడగడుగునా కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారు. 

తాజాగా ఎంపీ బాలశౌరి తన భవనంలో ఉన్న ఐసీఎంఆర్ గుర్తింపు పొందిన ఓ ల్యాబును ఖాళీ చేయమన్నారు. వాస్తవానికి ఆ లీజు ఇంకా ముగియలేదు. వారెంతో ఖర్చుపెట్టి ల్యాబ్ ఏర్పాటుచేశారు. అనుకోకుండా కరోనా సమయంలో అది ఎంతో ఉపయోగపడుతోంది. ఇదేమీ పట్టించుకోని యజమాని బాలశౌరి వెంటనే ఖాళీ చేయమని హకుం జారీ చేశాడు. లీజు టైం ఇంకా అవలేదు అన్నా కూడా పట్టించుకోలేదు. దీంతో వారు కోర్టుకు వెళ్లారు. ఇంతలో ఈ వార్త నేషనల్ మీడియాకు ఎక్కింది. బాలశౌరిని నేషనల్ మీడియా ఉతికారేసింది. చివరకు కోర్టు కూడా చీవాట్లు పెట్టడమే కాకుండా.. ల్యాబ్ కు రక్షణ కల్పించాలని తెలంగాణ పోలీసులను ఆదేశించింది. ఈ ల్యాబ్ హైదరాబాదులోని కినేటా టవర్ లో కొనసాగుతోంది. 

వైసీపీ ఎంపీ బాలశౌరి తీరును ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. కరోనా పరీక్షల కోసం ఐసీఎంఆర్ అనుమతి ఇచ్చిన ల్యాబ్ పనులకు ఎంపీ ఆటంకం కలిగించడం శోచనీయం, దారుణం అని తప్పుబట్టారు. కరోనాపై పోరులో ఫ్రంట్ లైన్ వారియర్స్ అయినా వైద్య సిబ్బందిని ముందు నుంచి వైసీపీ ప్రభుత్వం వేధిస్తోందని విమర్శించారు. తాజాగా బాలశౌరి తీరును బాబు తీవ్రంగా తప్పుపట్టారు. జాతీయ మీడియాకు ఎక్కిన ఈ వార్త తెలిసిన ప్రతి ఒక్కరు ఎంపీని తిడుతున్నారు. కరోనా నేపథ్యంలో దాని నివారణకు ఉపయోగపడుతున్న ల్యాబ్ ను ఖాళీ చేయించమని ఒక ఎంపీ అగడగడం ఏంటి అని జనం ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి వ్యక్తికి ప్రజలు ఎలా ఓటేశారు అని జనాన్ని ప్రశ్నిస్తున్నారంటే... ఆ ఎంపీ ఎంత దారుణంగా వ్వవహరించారో అర్థమవుతోంది.