జగన్ గారి ఇంగ్లిష్ మీడియ సర్వే... మెలిక ఇదేనా

August 04, 2020

అందరూ ఊహించిందే జరిగింది. ఏపీలో ఇంగ్లిష్ మీడియంకి అనుకూలంగా జగన్ సర్వే చేయిస్తే అది ఇంగ్లిష్ మీడియాకే అనుకూలంగా వస్తుందిగా. అలాగే వచ్చింది మరి చేసిందెవరు.... జగన్ కార్యకర్తలతో తయారుచేసిన వలంటీర్ టీమ్. మరి వారు సర్వే చేస్తే ఇంగ్లిష్ మీడియం సెలెక్ట్ చేసుకోకుండా తెలుగు మీడియం సెలెక్ట్ చేసుకుంటారా?  పైగా అమ్మఒడి పథకం కూడా ఈ వలంటీర్లే ఇవ్వాలాయె. మరి వారికి లేదు మాకు తెలుగు మీడియం కావాలని చెబితే అమ్మ ఒడి వస్తుందా... అదీ మ్యాటర్. 

సరే... ఇంతకీ గవర్నమెంటు ఎలా సర్వే చేసిందో చూద్దాం. వలంటీర్లు 1-5 వ తరగతి చదువుతున్న ఇంటింటికి తిరిగారట. ఇలాంటి వారు 18 లక్షల మంది ఉన్నారట. వారందరితో వలంటీర్లు సర్వే చేయించారట.  మీకు ఇంగ్లిష్ కావాలా? తెలుగు కావాలా? ఇంక వేరే ఏదైనా మీడియం కోరుకుంటున్నారా అని ప్రశ్న వేశారట. తల్లిదండ్రుల్లో 96.17 శాతం ఇంగ్లిష్ మీడియం ఎంచుకున్నారట. జగన్ కు నచ్చని ఆన్సర్ చెబితే అమ్మ ఒడి పథకం వస్తుందో రాదో అన్నఅనుమానం క్రియేట్ చేస్తే పాపం వారు మాత్రం ఏం చేస్తారు.  

ఎందుకీ సర్వే...

హైకోర్టు కూడా ప్రభుత్వ జీవోను రద్దు చేయడంతో జగన్ సర్కార్ దీనిపై సుప్రీంకోర్టుకి వెళ్లాలని భావించింది. దీంతో తమ వాదనకు ఏదైనా బలం కావాలని కోరుకుంది. అందులో భాగంగా ముందస్తుగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించింది. ఈ అభిప్రాయ సేకరణ  ఆధారంగా ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసే ప్రయత్నం చేస్తుందన్నమాట. 

పిటిషన్ సుధీష్ రాంబొట్ల ఏమంటున్నారు?

తెలుగు భాష బోధన తొలగించకూడదని పిటిషన్ వేసిన సుధీష్ రాంబొట్ల పై వైసీపీ సోషల్ మీడియాలో తీవ్రంగా దూషిస్తూ విమర్శలు చేస్తోంది. వాస్తవానికి పిటిషనర్ సుధీష్ రాంబొట్ల ఇంగ్లిష్ మీడియం వద్దని పిటిషను వేయలేదు. తెలుగు భాష ఉండాలని మాత్రమే కోరారు. ఇంగ్లిష్ మీడియం పెట్టడానికి ఏం అభ్యంతరం చెప్పలేదు. అయితే కేవలం టీచర్లకు వారం రోజుల శిక్షణతో ఇంగ్లిష్ మీడియం పెడుతున్నారని... అలా చేయడం వల్ల పిల్లలకు అటు తెలుగు ఇటు ఇంగ్లిష్ రాకుండా పోతుందని ఇది వారి భవిష్యత్తుకు ప్రమాదమని, డ్రాపవుట్స్ పెరుగుతాయని పిటిషన్ పేర్కొన్నారు. ఇక జగన్ సర్కారు కనుక కొత్త వాదనతో సుప్రీంకోర్టుకు వెళితే అక్కడ కూడా తెలుగు భాష కోసం పోరాడేందుకు సుధీష్ రాంబొట్ల సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఆయన సుప్రీం కోర్టులో కేవియట్ పిటిషన్ కూడా వేశారు.