గట్టిగా ఏడ్చేసిన ఏపీ మంత్రి 

August 13, 2020

మచిలీపట్నంలో జరిగిన హత్య సంగతి తెలుసు కదా. హత్యకు గురయిన వ్యక్తి భాస్కరరావు ఎవరో  కాదు, ఏపీ మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు. అతనితో ఎప్పటి నుంచో మంత్రికి అనుబంధం ఉంది. సుదీర్ఘంగా నానితోనే  ప్రయాణిస్తూ వచ్చారు భాస్కరరావు. తాజాగా ఈరోజు భాస్కరరావును దండుగులు సైనైడ్ పూసిన కత్తితో పొడిచి చంపారు. 

తన ముఖ్య అనుచరుడిని కోల్పోయిన ఏపీ మంత్రి తీవ్ర వేదనకు గురయ్యారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చాక మంత్రి అక్కడికి వచ్చారు. చూడగానే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు మంత్రి పేర్నినాని. ఏకంగా గట్టిగా ఏడ్చేశారు. అలా వదిలేసి వెళ్లిపోయావేంట్రా అని తీవ్రంగా కన్నీరు పెట్టారు.

ఈ ఘటన చూసి వైసీపీ శ్రేణులు కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాయి. రాజకీయ నాయకులు అనుచరులు కోల్పోతే బాధపడతారు. కానీ ఇలా బయటకు ఏడ్వరు. సాధారణంగా ఇలాంటి సీన్లు మనకు కనిపించవు. కానీ నాని మాత్రం తన హోదా మరిచి అనుచరుడిని శవంగా చూసి తట్టుకోలేకపోయారు.

అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి భరోసా ఇచ్చారు.