ఏపీ ప్రజలకు ఇపుడు కొత్త ఆందోళన..

August 06, 2020

ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇతర రాష్ట్రాల కంటే 2 రూపాయలు పెట్రోలు, డీజిలుపై వ్యాట్ ఎక్కువ ఉంది అని అప్పటి ప్రతిపక్ష నేత జగన్ వీరావేశంతో అసెంబ్లీలో ప్రసంగంచారు. వాయిదా తీర్మానం పెడితే తిరస్కరించినందుకు ఇంతకుమించి ఏం ఇంపార్టెంట్ ఉంటుందని ప్రశ్నించారు. కట్ చేస్తే ఆయన సీఎం అయ్యారు.

ఇపుడు చరిత్రలో ఎన్నడూ లేనంత వ్యాట్ పెట్రోలు డీజిలుపై విధించారు. అసలే మోడీ మోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు జనం.  అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు కనిష్ఠంగా ఉన్నవేళ.. కేంద్రంలోని మోడీ సర్కారు విధానాల వల్ల పెట్రోల్.. డీజిల్ ధరలు భారీగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో అన్ని దేశాల కంటే ఎక్కువ రేట్ల మనదేశంలో ఉన్నాయి. 

అలాంటిది పెట్రోలు డీజిలు రేట్లు ప్రపంచంలోనే అత్యధికంగా మన వద్దే ఉండాలంటూ  రికార్డు సృష్టించడానికి అన్నట్లు సీఎం జగన్ పెట్రోలు, డీజిలు ధరలు పెంచారు. డీజలు ధర పెరగడం అంటే కేవలం ఆ డీజిలు ధర మాత్రమే పెరగడం కాదు. లీటరు అదనంగా 4 రూపాయలు చెల్లిస్తున్న లారీలు, ట్రాక్టర్లు, మెషిన్ల యజమానులు ఊరుకోరు కదా వాటి అద్దెలు పెంచుతారు. దీంతో నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. పంట పనుల ధరలు పెరుగుతాయి.  ఆటో ఛార్జీలు పెరుగుతాయి. అంటే కూలీ నుంచి రైతు వరకు ఉద్యోగి నుంచి ఉన్నతాధికారి వరకు రెండు మూడు రకాలుగా ఈ పెట్రోలు డీజిలు భారంగా మారనున్నాయి.  

జగన్ కొందరికి పథకాలు ఇచ్చి, అందరికీ జరిమానా వేశారు. జగన్ నిర్ణయం వల్ల రైతు కూలీలు, రైతులు, దిగువ మధ్యతరగతి వారే ఎక్కువ ఇబ్బందిపడతారు. ఈ నిర్ణయంపై వైసీపీ క్యాడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది.

ఇదిలా ఉండగా...  పెట్రోలు, డీజిలుపై పెంచిన వ్యాట్ ను వెంటనే తగ్గించాలని ప్రతిపక్షనేత చంద్రబాబు ఏపీ సర్కారును డిమాండ్ చేశారు.