స‌గ‌టు జీవికి దెబ్బేసిన మోడీ

April 01, 2020

కేంద్ర బ‌డ్జెట్ అన్నంత‌నే ఎవ‌రెన్ని చెప్పినా స‌గ‌టుజీవి చూసే అంశాలు మూడే మూడు అంశాలు. అందులో మొద‌టిది ఆదాయ‌ప‌న్ను మీద ఇచ్చే రిబేటు. రెండోది బ‌డ్జెట్ కార‌ణంగా పెరిగేవి.. త‌గ్గేవి ఏమిట‌న్న‌ది.. మూడోది.. బ‌డ్జెట్ కార‌ణంగా త‌న జీవితం మీద ప్ర‌భావం చూపించే కీల‌క‌మైన అంశం ఏమైనా ఉందా? అన్న‌ది మాత్ర‌మే.
తాజాగా కేంద్ర ఆర్థిక‌మంత్రి హోదాలో నిర్మ‌లా సీతారామ‌న్ ప్ర‌క‌టించిన బ‌డ్జెట్ విష‌యానికి వ‌స్తే.. ఆదాయ‌ప‌న్ను రిబేటు విష‌యంలో ఎలాంటి ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌లేద‌ని చెప్పాలి. గ‌తంలో ప్ర‌క‌టించిన రూ.5ల‌క్ష‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. ఇక‌.. వ‌రాలు.. వాత‌ల విష‌యానికి వ‌స్తే.. పెట్రోల్.. డీజిల్ మీద లీట‌రుకు రూపాయి చొప్పున సెస్ రూపంలో వ‌సూలు చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించి.. ఒక్క నిర్ణ‌యంతో దేశంలోని ప్ర‌తి ఒక్క‌రికి బ‌డ్జెట్ దెబ్బ ఎలా ఉంటుందో చూపించారు.
తాజాగా ప్ర‌క‌టించిన బ‌డ్జెట్ ప్రకారం పెట్రోలు.. డీజిల్.. బంగారం.. ఆటోపార్ట్స్.. సీసీ టీవీ కెమేరా.. జీడిప్పుడు.. దిగుమ‌తి చేసుకునే పుస్త‌కాలు.. పీవీసీ..ఫినాయిల్.. ఫోరింగ్ టైల్స్.. మెట‌ల్ ఫిట్టిగ్.. ఫ‌ర్నీచ‌ర్.. సింథ‌టిక్ ర‌బ్బ‌ర్.. మార్బుల్ ల్యాప్స్.. ఆఫ్టిక‌ల్ ఫైబ‌ర్ కేబుల్.. ఐపీ కెమేరా.. డిజిట‌ల్ వీడియో రికార్డ‌ర్స్ ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి.
మ‌రిన్ని వ‌స్తువుల ధ‌ర‌లు పెరిగిన‌ప్పుడు త‌గ్గే వాటి లెక్క చెప్పండంటారా? అన్ని ఆశ‌లు ఏమీ అక్క‌ర్లేదు. ధ‌ర‌లు త‌గ్గే అవ‌కాశం ఉన్న వాటిల్లో ఎల‌క్ట్రిక‌ల్ వాహ‌నాలు.. ఇంటి రుణాలు.. తోలు ఉత్ప‌త్తుల ధ‌ర‌లు మాత్ర‌మే త‌గ్గ‌నున్నాయి. నిత్యం వాడే వ‌స్తువుల మీద ఎలాంటి త‌గ్గుద‌ల లేక‌పోగా.. పెర‌గ‌టం మాత్రం బాధించేదే.