వావ్... కరోనా వ్యాక్సిన్ కనిపెట్టిన భారత్ !!

August 04, 2020

ఫార్మా రంగంలో ఇప్పటికే ముందున్న భారతదేశం మరో అడుగు వేసే దిశగా పయనిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 2.5 లక్షలకు పైగా ప్రాణాలను బలి తీసుకుని అత్యంత వేగంగా భూగోళాన్ని చుట్టుముడుతున్న మహమ్మారికి మన వద్ద వ్యాక్సిన్ లేదు. మందు అసలే లేదు. దీంతో దీని బారిన పడిన వారిని  రక్షించడానికి ఆయాదేశాలు విపరీతంగా శ్రమిస్తున్నాయి. ప్రతి దేశమూ వ్యాక్సిన్ తయారీకి నడుంకట్టింది. ఈ క్రమంలో భారత్ కూడా పరిశోధనలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా భారత్ లో దీనికి ఒక వ్యాక్సిన్ రూపొందించినట్లు  పీజీఐఎంఈఆర్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ జ‌గ‌త్ రామ్ వెల్లడించారు. సేఫ్టీ ట్రయల్స్ ను ఈ వ్యాక్సిన్ విజయవంతగా దాటేసింది. క్షయ వ్యాధి, సెప్సిస్ వాడుతున్న Mw Vaccine ను మరింత మెరుగుపరిచి సేఫ్ట్ ట్రయల్స్  చేయగా మంచి ఫలితాలు వచ్చాయని భారత్ పేర్కొంది. 

ఈ వ్యాక్సిన్ ఐసీఎంఆర్ అనుమతితో తొలుత 40 మందిపై ప్రయోగించనున్నారు. దేశంలోని నాలుగు ప్రముఖ ఆస్పత్రుల్లో క్లినికల్ ట్రయల్స్ తొలి దశను పూర్తిచేశారు. ఆ దశలో విజయవంతమైన ఫలితాలు వస్తే తుది దశలో పెద్ద సంఖ్యలో ప్రయోగాలు చేశారు. ఇక అది కూడా సక్సెస్ అయితే... అధికారికంగా దీని తయారీకి ప్రభుత్వం అనుమతిస్తుంది.  తొలి దశ ఢిల్లీలోని ఎయిమ్స్‌, భోపాల్‌, పీజీఐ చండీగ‌ఢ్‌  ఆస్పత్రుల్లో నిర్వహిస్తారు. దీనిపై జగత్ రాం మాట్లాడుతూ Mw vaccine (ఎం.డబ్ల్యు. వ్యాక్సిన్) పూర్తిగా విజయవంతం కాగలదని నమ్ముతున్నట్లు చెప్పారు.

ఇదిలా ఉండగా... తుది దశ పూర్తి కావడానికి ఇంకో రెండు నెలల సమయం పట్టొచ్చు. అది విజయవంతం అయితే... 130 కోట్ల వ్యాక్సిన్లు తయారుచేయడానికి కనీసం 8 నెలలు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి... ఇదంతా ఏడాది ప్రాసెస్ కాబట్టి జనం జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. సామాజిక దూరం, చేతులు-వ్యక్తిగత పరిశుభ్రత, మాస్కుల సాయంతో మాత్రమే ప్రస్తుతం మనం దీంతో పోరాడగలం. 

ఇక వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రాణాలు కాాపాడుకోవాలంటే మందు కూడా అవసరం... ఈ దిశగా అమెరికా ముండుగు వేసినట్లు తెలుస్తోంది. గిలియడ్ సైన్సెస్ కంపెనీ ఎబోలా కోసం రూపొందించిన రెమెడిసివిర్ మందు సమర్థంగా కరోనా వైరస్ ను నాశనం చేస్తోందని అమెరికా అధికారికంగా ప్రకటించింది. అయితే, ఇంకా ఇది కూడా క్లినికల్ ట్రయల్స్ లో ఉంది.