వైసీపీ లేడీ స్టార్స్ పై హైకోర్టులో పిల్

May 31, 2020

మాది అధికారి పార్టీ మాకు చెప్పేదెవరు?  అన్న ఇగో

ఎన్నికల్లో ఓడిపోతే జగన్ తో చీవాట్లు ? అన్న భయంతో కూడిన ప్రచార పిచ్చి

పేరు కొట్టేయడానికి భలే ఛాన్సులే ? అన్న బాధ్యతా రాహిత్యం, అవగాహనా రాహిత్యం 

ఇవన్నీ కలిసి ఏపీ ప్రజల కొంప ముంచాయి. లాక్ డౌన్ అనేది కేవలం జనాలకే, నాయకులకు కాదు అన్నట్లు వ్యవహరించారు ఏపీలో వైసీపీ నాయకులు. దీనివల్ల ఏపీలో కరోనా మరింత వ్యాపించింది. లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘనలో కూడా వైసీపీ వారిని అయితే చూసి వదిలేయడం ... వారు ఎక్కడ పడితే అక్కడ తిరగడం ఇలాంటి కారణాల వల్ల తొలుత అంతమవ్వాల్సిన కరోనా ఏపీలో ఇంకా పెరుగుతోంది. దీంతో వీరి వ్యవహారంపై ఓ సామాన్యుడికి మండింది. అందుకే వీరిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టుకు వెళ్లారు. 

కరోనా లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా సభలు, సమావేశాలు, ర్యాలీలు ఏర్పాటుచేసిన ఎమ్మెల్యేలు రోజా, రజని, బియ్యపు మధుసూదన్ రెడ్డి, సూళ్లూరు పేట ఎమ్మెల్యే సంజీవయ్య, పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడలను ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్ లాయర్ కిషోర్ కోరారు. కేంద్రం ప్రతి ఒక్కరు ఇళ్లలో ఉండాలని చెబితే... అధికార పార్టీ నాయకులు తమ పవర్ ను దుర్వినియోగం చేశారు అని ఆయన పేర్కొన్నారు. వీరు నిర్వహించిన ర్యాలీలపై జాతీయ మీడియాలో కూడా విమర్శలు వచ్చాయని... చాలా బాధ్యతారహితంగా ప్రవర్తించారని పిటిషనర్ అన్నారు కరోనా వల్ల రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే తగ్గించాల్సిన వీరే కరోనా వ్యాప్తిని పెంచేలా వ్యవహరించారన్నారు. శ్రీకాళహస్తిలో అయితే ఎమ్మెల్యే ర్యాలీ వల్లే కొందరికి కరోనా సోకిందన్న విషయాన్ని అధికారికంగా ధృవీకరించారని అన్నారు.