పింక్ డేట్స్ వచ్చేశాయ్

August 13, 2020

సినిమాకున్న మేజిక్ అలాంటి ఇలాంటిది కాదు. ఒకసారి ముఖానికి రంగు పూసుకున్న తర్వాత.. దాన్ని విడిచి పెట్టి వెళ్లాలని అనుకున్నా.. దాన్ని విడిచి పెట్టి ఎక్కువ కాలం ఉండలేరు. నాకిక రాజకీయాలు తప్పించి.. సినిమాల్లో చేసే ఉద్దేశమే లేదని కరాఖండిగా చెప్పేసిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాల్లో నటిస్తూ సంచలనంగా మారారు.
హిందీ పింక్ రీమేక్ లో నటిస్తున్న పవన్ సినిమాకు వకీల్ సాబ్ అన్న పేరు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అధికారికంగా ఇప్పటివరకూ అనౌన్స్ చేయలేదు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు చిత్ర నిర్మాత దిల్ రాజు. పింక్ సినిమా షూటింగ్ సాగుతోందని.. మార్చిలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేస్తామన్న స్వీట్ న్యూస్ చెప్పారు.
అక్కడితో ఆగని ఆయన.. పవన్ సినిమా మేలో విడుదల అవుతుందని చెప్పారు. మరో నెల వ్యవధిలో ఫస్ట్ లుక్.. రెండు నెలల వ్యవధిలో సినిమానే థియేటర్లను టచ్ చేయనున్న విషయాన్ని చెప్పటం పవన్ అభిమానులకు పండుగలా అనిపించటం ఖాయం. జానుకు వస్తున్న పాజిటివ్ టాక్ నేపథ్యంలో ఆ చిత్రానికి పని చేసిన ముఖ్యులు ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. జాను సక్సెస్ కావటం సంతోషంగా ఉందని.. స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చినట్లు చెప్పారు. నాని.. సుధీర్ బాబు చిత్రాన్ని మార్చి 25న ఉగాది రోజున రిలీజ్ చేయనున్నట్లుగా మరో అనౌన్స్ మెంట్ కూడా చేసేశారు.