మా తెలుగు తల్లికి మల్లెపూదండ... ఇంగ్లిష్ వెర్షన్ విన్నారా?

August 07, 2020

తెలుగు భాషను ఏపీ ప్రభుత్వం పతనం దిశగా నడిపిస్తోంది. తెలుగు మీడియం విద్య చదువుకోవాలనుకునే వారికి ఉన్న ఏకైక అవకాశాన్ని పూర్తిగా తొలగిస్తోంది జగన్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో విపక్షాలన్నీ దానికి వ్యతిరేకంగా గొంతెత్తున్నాయి. చంద్రబాబు హయాంలో కేవలం నగర పాఠశాలల్లో మాత్రమే ఇంగ్లిష్ పెడితే గుడ్డిగా దానిని వ్యతిరేకించిన జగన్ ...తాను అధికారం చేపట్టాక గ్రామాలతో సహా అన్ని స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల పిల్లుల అటు ఇటు కాకుండా పోయే పరిస్థితి ఉంది. 

తెలుగు మాతృభాష లో బోధన తెలుగు రాష్ట్రంలోనే దొరక్కపోతే ఇంక ఎక్కడ దొరుకుతుందో అర్థం కాక తలలు పట్టుకునే పరిస్థితి. ఆప్షనల్ గా కూడా కాకుండా బలవంతంగా జగన్ ఇంగ్లిష్ మీడియంను విద్యార్థులపై రుద్దుతున్నారు. దీనికి వ్యతిరేకంగా తెలుగు ప్రజలు గళమెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి జగన్ తీరును తప్పుపడుతూ దానికి నిరసనగా మా తెలుగు తల్లికి మల్లెపూదండ అనే రాష్ట్ర గేయాన్ని ఇంగ్లిష్ లోకి తర్జుమా చేశారు. ఇదిగో చదవండి.