జగన్ అంబులెన్సులు ఏం చేస్తున్నాయి? - RRR

August 13, 2020

జగన్ తప్పులను నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామరాజు నిర్మొహమాటంగా కడిగిపారేస్తున్నారు. ప్రభుత్వం చేసే ఏ తప్పును వదలకుండా ప్రశ్నిస్తున్నారు. ఒకరకంగా ఆయన విమర్శలకు కూడా క్రెడిబులిటీ వస్తోంది. ఎందుకంటే రఘురామరాజు  వాస్తవ సంఘటనల ఆధారంగా మాత్రమే విమర్శలు చేస్తున్నారు. ఏ బేస్ లేకుండా ఒక్క విమర్శను కూడా చేయడం లేదు.

తాజాగా తన సొంత నియోజకవర్గంలో జరిగిన ఘటనపై రఘురామ రాజు తీవ్ర విచారం వ్యక్తంచేశారు. చెత్తను తరలించడానికి వాడే మున్సిపాలిటి బండిలో కోవిడ్ సోకిన వ్యక్తిని తీసుకెళ్ల‌టం బాధాక‌ర‌మ‌ని, త‌న సొంతూళ్లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై సిగ్గుతో త‌ల‌దించుకుంటున్నానని ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. తన ప్రమేయం లేకపోయినా తన నియోజకవర్గంలో తప్పు జరిగిన దానికి అతను ప్ర‌జ‌లు త‌న‌ను క్ష‌మించాల‌ని కోరడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్ర‌భుత్వం ఎంతో గొప్ప‌గా ఆడంబరంగా ఆర్భాటంగా ప్రారంభించిన 1000కి పైగా అంబులెన్సులు ఏం చేస్తున్నాయని నిలదీశారు రాజుగారు. ఒక్క‌టి కూడా అవ‌స‌రానికి ప్రజలకు ఉప‌యోగ‌ప‌డటం ‌లేద‌న్నారు.

క‌రోనాలో కేసులు పెరుగుదల పై కూడా ఆయన స్పందించారు. ప్రభుత్వం వ్యాప్తిని అరికట్టకపోతే ఏపీ దేశంలో నెం.1 స్థానానికి చేరుతుందన్నారు. ట్రూనాట్, ఆర్టీ పీసీఆర్ టెస్టుల ద్వారానే క‌రోనా కచ్చితంగా గుర్తించగలమని అన్నారు. యాంటీజెన్ టెస్టులు అంత ఉపయోగకరం కాదని... క‌రోనా సోకిన వారం అయిన త‌ర్వాతే ఆ టెస్టుల్లో తెలుస్తుందని... అందుకే పెద్ద సంఖ్యలో టెస్టులు చేస్తున్నా...  ఏపీలో సామాజిక వ్యాప్తి జరిగిందన్నారు.

ప్రతి దానికి జగన్ పేరు పెడుతున్నారు. పర్లేదు...కోవిడ్ చర్యలకు కూడా జగనన్న కరోనా కేర్ అని పెట్టుకోండి... అపుడైనా జగన్ పేరు వినపడి అందరూ సరిగా పనిచేసి అరికడతారేమో అని వ్యంగాస్త్రం వేశారు.​​