మోడీకి సంచలన రిక్వెస్ట్ చేసిన కేసీఆర్

August 14, 2020

లోకమంతా ఒకలా ఆలోచిస్తే కేసీఆర్ ఇంకో మార్గంలో నడుస్తున్నారు. రేపటి నుంచి రైళ్లు నడపడానికి కేంద్రం ఏర్పాట్లు చేసిన విషయం తెలిసిందే. అయితే... ఎట్టి పరిస్థితుల్లోను రైలు నడపొద్దని మోడీకి కేసీఆర్ విజ్జప్తి చేశారు. ఒకవైపు కేసులు పెరుగుతున్నాయి. నగరాలకే రైళ్లు ప్రారంభించారు. కేసులున్నది వాటిలోనే అటు ఇటు జనాలు మారితే కేసులు ట్రేస్ చేయడం, గుర్తించడం కష్టం... కాబట్టి రైళ్లు నడకపోతే మంచిది అయిన కేసీఆర్ మోడీని కోరారు. 

కేసీఆర్ మోడీని ఇంకా కోరారు అంటే...

అప్పులను రీషెడ్యూల్ చేయాలి

ఆదాయం లేదు, అప్పులు కట్టలేం.

ఎఫ్.ఆర్.బి.ఎం పరిమితి పెంచాలి. మరింత అప్పు తీసుకునే వెసులు బాటు ఉండాలి.

కొన్ని రాష్ట్రాలు వలస కూలీలను అనుమతించడం లేదు. వారిని అనుమతించాలి.

కేసులు కంట్రోల్ అయిన జోన్లను మార్చమని రిక్వెస్టులు పంపుతుంటే వెంటనే ఆమోదించడం లేదు. వీటిలో ఫాస్టుగా రియాక్టవ్వాలి.

కేసీఆర్ ఇంకా ఏమన్నారు?

ఆగస్టులోపే వ్యాక్సిన్ వస్తుంది. అది కూడా మనదేశంలోనే హైదరాబాదు కంపెనీలే తయారుచేస్తాయన్న నమ్మకం ఉంది. మనది సెంటిమెంటు దేశం. దూరంగా ఉన్నవారికి సొంతవారిని చూడాలన్న కోరిక ఉంటుంది. కూలీలు, శ్రామికులు వెళ్తామంటే పంపాలి, వస్తామంటే తీసుకోవాలి. అపుడే పనులు సక్రమంగా జరుగుతాయి. కరోనా నివారణకు అవసరమైన అన్ని సదుపాయాలు, కిట్లు సమృద్ధిగా ఉన్నాయి. ఎటువంటి సమస్య లేదు. ఇది ఇపుడే మనల్ని వదిలిపోదు. అందరూ దాంతో కలిసి బతికే ప్రయత్నం చేయాలి.