వైజాగ్ - ప్రధాని, సీఎం, కమిషనర్ ఏమన్నారు?

August 12, 2020

ఈ విశాఖపట్నం గ్యాస్ లీక్ ఒక్కసారిగా ప్రపంచాన్ని ఉలికి పాటుకు గురిచేసింది. విశాఖపట్నం శివారులో జరిగిన ప్రమాదం గురించి స్థానిక అధికారులు మొదలుకొని ప్రధాని నరేంద్రమోడీ, ప్రపంచంలోని పలువురు ప్రముఖులు, అంతర్జాతీయ మీడియా కూడా ఆందోళన చెందారు దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా అసలు దీని గురించి ఎవరు ఏమన్నారో తెలుసుకుందాం.

సృజన గుమ్మళ్ల, విశాఖపట్నం కమిషనర్ ఏమన్నారు :

ఈ తెల్లవారుజామున ఉదయం 2.30 గంటలకు గోపాలపట్నం పరిధిలోని వేపగుంటలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టిరీన్ విషవాయువు లీకైంది. దీనిని పీల్చిన వారు కొందరు అస్వస్థతకు గురి కాగా, ఇంకొందరు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. 

(Tweet: Primary report is PVC gas (or Styrene) leaked from LG Polymers, Vepagunta near Gopalapatnam in Visakhapatnam at around 2:30 AM today. Because of the leakage of the said compound gas hundreds of people have inhaled it and either fell unconscious or having breathing issues.) 

ముఖ్యమంత్రి జగన్, ఆంధ్రప్రదేశ్, ఏమన్నారంటే...

స్టిరీన్ గ్యాస్ వాయువు లీకైన దుర్ఘటన తీవ్రంగా కలచివేసింది. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి ప్రజలను రక్షించాలి. వీలైనంత తక్కువ ప్రాణ, జంతు నష్టంతో ఈ సమస్యను పరిష్కరించండి.

ప్రతిపక్ష నేత చంద్రబాబు, తెలుగుదేశం, ఏమన్నారంటే..

8 మందిని బలితీసుకుని, వందలాది మందిని ఆస్పత్రి పాల్జేసిన ఈ ఘోరమైన విశాఖపట్నం గ్యాస్ లీకేజీ దుర్ఘటన నన్ను షాక్ కు గురిచేసింది. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు సాయం చేయడానికి తెలుగుదేశం శ్రేణులు సదా సిద్ధంగా ఉండండి. అధికారులు సూచించిన జాగ్రత్తలు ప్రతిఒక్కరూ పాటించాలని కోరుతున్నాను.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఏమన్నారంటే..

విశాఖపట్టణంలో ఈ తెల్లవారుజామున సంభవించిన గ్యాస్ దుర్ఘటన (Visakhapatnam Gas Leak) నుంచి ప్రతి ఒక్కరూ క్షేమంగా బయటపడాలని ప్రార్థిస్తున్నాను. విశాఖపట్నంలో పరిస్థితుల గురించి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ(MHA),  జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ (NDMA) అధికారులతో మాట్లాడాను. వీరు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.  

(Tweet: Spoke to officials of MHA and NDMA regarding the situation in Visakhapatnam, which is being monitored closely. I pray for everyone’s safety and well-being in Visakhapatnam.)  

ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ, ఏమన్నారంటే..

ఇది అత్యంత దురదృష్టకరమైన ఘటన. విశాఖపట్నం గ్యాస్ లీకేజీ ప్రమాదంలో ప్రాణాలు కోల్పయిన వారికి నా ప్రగాఢ సానుభూతి. బాధితులు త్వరగా, క్షేమంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.