మరో షాక్ కు దేశం రెడీ అవ్వాల్సిందేనా !

August 11, 2020

PM Modi to Adress the nation today at 8 pm: లాక్డౌన్ 4.0 ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు రాత్రి 8 గంటలకు దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కో-విడ్, లాక్-డౌన్ పై ముఖ్యమంత్రులతో సమావేశమైన ఒక రోజు తర్వాత ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ఈ రోజు సాయంత్రం 8 గంటలకు ప్రధాని మోడీ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారని ట్విట్టర్‌లో ప్రధాని కార్యాలయం తెలిపింది.
మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రతిసారి పేదలు, చిరు వ్యాపారులకు చిక్కులు తెచ్చిపెట్టే గండాలే తెచ్చిపెట్టారు. మరి ఈరోజు ఏం బాంబు పేల్చనున్నారో. చివరిసారిగా ప్రధాని దేశాన్ని ఉద్దేశించి ఏప్రిల్ 14 న మాట్లాడారు. ఆనాడు దేశవ్యాప్తంగా లాక్డౌన్ మే 3 వరకు పొడిగించినట్లు ప్రకటించారు. 

తదనంతరం మే 17 వరకు మూడో దశ లాక్‌డౌన్ ప్రకటించినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా దేశంలో కో-విడ్  మ.రణాలు 2293గా నమోదయ్యాయి.