మోడీ సంచలనం.... ఎక్కడికెళ్లాడో తెలుసా

August 15, 2020

వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంలో మోడీ ఎపుడూ భారతీయులను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. జనం మూడ్ కు అనుగుణంగా మోడీ ప్రవర్తన ఉంటుంది. మెజారిటీ ప్రజలకు సర్ ప్రైజ్ ఇచ్చేలా ఆయన ప్రణాళిక రూపుదిద్దుకుంటుంది.

దాదాపు ఇక యుద్ధమే అని అనిపించేంతగా చైనా సరిహద్దుల్లో పరిస్థితులు ఉన్న నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ కల్లోలిత ప్రాంతం లడఖ్ కి వెళ్లారు. శుక్రవారం ఉదయం సడెన్గా లడఖ్ లో ప్రత్యక్షమయ్యారు మోడీ.

భారతీయ సైనికుల్లో మరింత ధైర్యం నింపడంతో పాటు భారతీయుల్లో మరిన్ని భావోద్వేగాలు పండించడం ఈ పర్యటన లక్ష్యం.