పీవోకేలో... ఇపుడు భారత దేశం మేలంటున్నారు

August 11, 2020

వ్యవసాయం చేతకాని వాడు నాకు వెయ్యి ఎకరాలు కావాలన్నట్టుంది పాకిస్తాన్ పరిస్థితి. ఉగ్రవాదం తప్ప ఏ రంగమూ అక్కడ అభివృద్ధి చెందడం లేదు. ప్రజలు పాకిస్తాన్ లోని అత్యధిక ప్రాంతాల్లో కడు పేదరికంలో బతుకుతున్నారు. అక్కడ వారి ఆకలి తీర్చలేకపోతున్న పాకిస్తాన్ కాశ్మీర్ కూడా నాకే కావాలంటుంది. పీవోకే... పాక్ ఆక్రమిత కాశ్మీర్. పీవోకే పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే కరోనాను అరికట్టడంలో తీవ్రంగా విఫలం అవుతున్న ఆ దేశం... పీవోకేలోని ప్రజలను కాపాడలేకపోతోంది. ఏ సదుపాయాలు కల్పించలేకపోతోంది. పీవోకే ప్రాంతంలోని ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారు.

మనదేశంలో అన్ని రాష్ట్రాలు పేదలను ఆదుకుంటున్నాయి. వలస కూలీలకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఒక్క ఢిల్లీ మహానగరంలోనే 6 లక్షల మంది నిరాశ్రయులకు అన్నం పెడుతున్నారు. కానీ పీవోకేలో ప్రభుత్వం మాత్రం అక్కడి వారిని ఆదుకోలేకపోతోంది. ఉచితం సంగతి తర్వాత, అసలు దుకాణాల్లోనే సరుకులు లేని పరిస్థితి. కొనడానికి డబ్బులేలేవు. డబ్బులున్న సరుకులు అందవు. ప్రభుత్వం పంచే వాటిని అధికారులువాడుకోవడం లేదా బ్లాక్ లో అమ్ముకోవడం చేస్తున్నారు. దీంతో అక్కడ ఆకలికేకలు వినిపిస్తున్నాయి. మేము భారతదేశంలో ఉంటే మా ఆకలి తీరేదేమో అన్న మాటలు అక్కడ వినిపిస్తున్నాయట.