రివర్స్‌ టెండరింగ్‌ - ప్రాజెక్టు భద్రతకు ముంపు

February 23, 2020

ప్రాజెక్టు పూర్తి కావడానికి 3 ఏళ్ల ఆలస్యానికి దారి తీస్తుంది

1. గతంలో ఒక్క శాతం కూడా పనులు పూర్తి చేయలేక చేతులెత్తేసిన మ్యాక్స్‌ ఇన్‌ ఫ్రా కంపెనీకి పోలవరం పనులు అప్పగించి సూపర్‌ హిట్‌ అంటూ వైసీపీ నేతలు పొగడ్తలతో ముంచెత్తడం జగన్నాటకంలో మొదటి అంకం మాత్రమే.

2. రివర్స్‌ టెండరింగ్‌ వల్ల ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌ భద్రతకు ఎవరు బాధ్యత వహిస్తారు? పాత కాంట్రాక్టరా? కొత్త కాంట్రాక్టరా? ఎవరో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం స్పష్టం చేయాలి.

3. రివర్స్‌ టెండర్‌ వల్ల ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడానికి కనీసం మూడేళ్లు ఆలస్యమౌతుంది. నవయుగను కొనసాగంచి ఉంటే 2020 జూన్‌కు గ్రావిటీతో నీరు ఇచ్చి ఉండేవారు.

4. నాసిరకం పనుల వల్ల భారీ ప్రాజెక్టు భద్రతకు ప్రమాదం ఏర్పడితే ఉభయ గోదావరి జిల్లాలు రెండు పెను ప్రమాదానికి గురౌతాయి. ఏదో తగ్గించానని గత ప్రభుత్వంపై నిందులు మోపడానికి రెండు జిల్లాలు కొట్టుకుపోవడానికి కారకులౌతారు.

5. నవయుగను తొలగించి మెగా కృష్ణారెడ్డి కంపెనీకి కట్టబెట్టడం వల్ల కనీసం  మూడేళ్లు ఆలస్యమౌతుంది. ఒక్క ఏడాది ఆలస్యమైతే విద్యుత్‌ బిల్లు రూ.300 కోట్లు అదనపు భారం పడుతుందని కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోలవరం ప్రాజెక్టు అధారిటీ స్పష్టం చేసింది. మూడేళ్లు ఆలస్యమైతే రూ.900 కోట్లు అదనపు భారం ప్రభుత్వంపై పడుతుంది.

6. ఇదే కాక ఆలస్యం వల్ల వేల కోట్ల విలువ గల పంట దిగుబడులు కోల్పోతాము. చంద్రబాబు ప్రభుత్వంపై నిందలు మోపడానికి రూ.500 కోట్లు మిగిల్చినట్టు నాటకమాడి రూ.5వేల కోట్ల నష్టం తెచ్చిపెడుతుంది రివర్స్‌ టెండరింగ్‌.

7. పోలవరంలో కలిగే నష్టాన్ని భర్తీ చేసుకొని అధిక లాభం పొందడానికి మెగా కృష్ణారెడ్డికి రూ.2వేల కోట్లకు పైగా విలువ చేసే ఎలక్ట్రికల్‌ బస్సుల కాంట్రాక్టు అప్పగించడానికి రంగం సిద్దమయ్యింది.

8. రూ.30వేల కోట్లకు పైగా ఉన్న వాటర్‌ గ్రిడ్‌ పనులు కూడా వారికి కట్టబెట్టేందుకు పథక రచన చేశారు.

9. జలయజ్ఞంలో వైఎస్‌ పాలనలో వేల కోట్లు దోచిన జగన్‌ తన అవినీతిని కప్పి పెట్టుకోవడానికి పోలవరంలో లేని అవినీతి ఉన్నట్టుగా భ్రమింపజేయడానికే రివర్స్‌ టెండరింగ్‌ నాటక మాడుతున్నారు.

10. భారీ ప్రాజెక్టు నిర్మించే అర్హత లేని తన వర్గానికి చెందిన మెగా కంపెనీకి అర్హత లేకున్నా నిబంధనలు సడలించారు. ఇది డ్యాం భద్రతకు పెను ముప్పుకు దారి తీస్తుంది.

11. ఉభయ గోదావరి జిల్లాల్లో లక్షలాది ప్రాణాల భద్రతకు ప్రమాదం తెచ్చి పెట్టగలదు.

12. ప్రజల ప్రాణాలతో చెలగాలమాడే రివర్స్‌ నాటకాన్ని కట్టిపెట్టాలి. కేంద్ర ప్రభుత్వం సూచన ప్రకారం నవయుగను కొనసాగించాలి. 2020 జూన్‌ నాటికి గ్రావిటీతో నీరు పారించాలి.

 

RELATED ARTICLES

  • No related artciles found