బాబుపై వ్యంగం, వర్మపై కేసు - పెట్టింది ఎక్కడో తెలుసా?

July 21, 2019

నాకు న‌చ్చింది చేస్తా? అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మను ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌ర‌మే లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. హిందీ మాట్లాడే రాష్ట్రాల్లోనూ వ‌ర్మ గురించి తెలియ‌ని వాళ్లు ఉండ‌ర‌నే చెప్పాలి. తాను మాట్లాడే ప్ర‌తి మాటా.. పోస్ట్ చేసే ప్ర‌తి పోస్టు దాదాపుగా వార్త‌ల్లో నిలిచేలా ఉండ‌టం వ‌ర్మ స్పెషాలిటీగా చెప్పాలి.
తాజాగా ఆయ‌న తీసిన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ ఎంత సంచ‌ల‌నంగా మారిందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఈ సినిమా స్టార్ట్ చేసిన నాటినుంచి టీడీపీ నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు.. అభిమానులు ఎంత ఆగ్ర‌హంగా ఉన్నారో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. త‌నను కోప‌గించుకునే వారికి మ‌రింత మంట పుట్టేలా చేయ‌టం వ‌ర్మ‌కు అల‌వాటే.
తాజాగా అలాంటి ధోర‌ణినే మ‌రోసారి ప్ర‌ద‌ర్శించారు వ‌ర్మ‌.
తాజాగా ఆయ‌న త‌న సోష‌ల్ మీడియా ఖాతాల‌లోఒక ఫోటోను పోస్ట్ చేసి.. తెలుగు త‌మ్ముళ్ల‌కు కాలిపోయేలా చేశారు. చంద్ర‌బాబు మెడ‌లో వైఎస్సార్ కాంగ్ఎస్ పార్టీ కండువా వేస్తున్న ఫోటోను పోస్ట్ చేశారు. దీనిపై ఒక‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేశారు.
ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును అవ‌మానించేలా ద‌ర్శ‌కుడు వ‌ర్మ పెట్టిన పోస్టింగ్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టీడీపీ కార్య‌క‌ర్త ఒక‌రు హైద‌రాబాద్ లోని బాచుప‌ల్లి పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేశారు. బాబును అవ‌మానించేలా వ‌ర్మ పోస్టింగులు ఉన్నాయ‌ని.. వాటిని ప‌రిశీలించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు. స‌ద‌రు వ్య‌క్తి ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు తీసుకున్నారు.