హాట్ గర్ల్ కి కష్టమొచ్చింది !

February 24, 2020

 ప్రముఖులు పలువురు లేనిపోని తిప్పలు తెచ్చి పెట్టుకుంటారు. అనుభవం లేకనో.. ఏం చేస్తార్లే అన్న నిర్లక్ష్యంతో గొంతు మీద వరకూ వచ్చేదాకా లైట్ తీసుకొని.. తర్వాత ఆగమాగం అవుతుంటారు. ప్రస్తుతం కొందరు బాలీవుడ్.. టాలీవుడ్ నటులు ఇదే తీరును ప్రదర్శిస్తున్నారని చెప్పాలి. ప్రముఖ గొలుసుకట్టు సంస్థ క్యూనెట్ పై సైబరాబాద్ పోలీసులకు పలు ఫిర్యాదులు అందాయి. దీంతో.. ఈ బ్రాండ్ కు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్న పలువురు ప్రముఖులకు సైబరాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
ఒక అంచనా ప్రకారం క్యూనెట్ మీద సైబరాబాద్ నమోదు చేసిన కేసులో దాదాపుగా 500 మందికి పైగా ప్రముఖులకు తొలి విడత నోటీసులు జారీ చేశారు. దీనికి కొందరు ప్రముఖులు మాత్రమే బదులిచ్చినట్లుగా తెలుస్తోంది. షారుఖ్.. బొమన్ ఇరానీ.. అనిల్ కపూర్లు మాత్రం తమ లాయర్ల ద్వారా పోలీసులకు బదులిచ్చారు. అదే సమయంలో బాలీవుడ్ కమ్ టాలీవుడ్ నటి పూజా హేగ్డే.. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబరాయ్ తదితరుల నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. దీంతో.. తాజాగా ఈ ప్రముఖులకు మరోసారి నోటీసులు పంపారు సైబరాబాద్ పోలీసులు.
నోటీసుల్లో పేర్కొన్న విధంగా విచారణకు హాజరు కాని పక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్యూనెట్ కు ఈ సినీ ప్రముఖులంతా గతంలో ప్రచారకర్తలుగా పని చేశారు. వీరందరిని చూసి తాము కంపెనీని నమ్మి పెట్టుబడులు పెట్టినట్లుగా బాధితులు పోలీసుల వద్ద స్పష్టం చేస్తున్నారు. పోలీసులు.. కోర్టులో పెట్టుకోవటం మంచిదా? అందులోకి న్యాయమైన అంశాల విషయంలో జాగరూకతో ఉండాల్సిన పూజాహెగ్డే లాంటోళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే.. తర్వాతి కాలంలో కేసులు.. వాయిదాలు.. విచారణల పేరుతో అదే పనిగా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అదంతా మనకు అవసరమా పూజా?