​అమరావతి ఉద్యమంపై దొంగ దెబ్బ​

July 16, 2020

రాజధాని మార్పు వద్దని అమరావతిలో మొదలైన ఉద్యమం ప్రభావం రోజురోజుకు తీవ్రం అవుతోంది. ఉద్యమం మీద కమ్మ ముద్ర వేస్తే అసలు వ్యతిరేకత రాదు అనుకున్న వైసీపీ వ్యూహం బెడిసికొట్టింది. అమరావతి ప్రాంతంలో రాజధాని వస్తే... ఇక తమ ఉపాధికి కొదవ ఉండదని, జీవితం సాఫీగా ఉంటుందని భావించి బడుగు బలహీన వర్గాలు రైతులతో కలిసి పోరాడటంతో ఉద్యమం తీవ్రమైంది. దీంతో పాటు అన్ని రాజకీయ పక్షాలు ఈ ఉద్యమానికి మద్దతు పలికాయి. ఒక్కసారిగా ఉద్యమం లేచింది. గ్రామాల్లో నిరసన దీక్షలకే రైతులు పరిమితం అవుతారని ప్రభుత్వం భావించింది. కానీ జాతీయ రహదారి ఎక్కడంతో ఉద్యమ తీవ్రత ప్రభుత్వాన్ని భయపెట్టింది. ఇంతవరకు ఈ ప్రాంత వాసులకు ఉద్యమ నేపథ్యం లేకపోయినా నిన్న వ్యూహాత్మకంగా వ్యవహరించారు. దఫదఫాలుగా జాతీయ రహదారిని దిగ్బంధనం చేయడంతో పోలీసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

రాజధాని తరలింపు ప్రభావం ఉన్న కృష్నా గుంటూరు జిల్లాల్లో అన్ని ప్రాంతాలకు ఉద్యమం పాకింది. మిగతా జిల్లాల్లోనే వీరికి మద్దతు మొదలైంది. దీంతో ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రం చేసి లక్ష్యం సాధించుకునేందుకు జేఏసీ ఏర్పడింది. అమరావతి పరిరక్షణ సమితి ఏర్పాటయ్యాక ఉద్యమం మరింత ఊపందుకుంది. జాతీయ రహదారి దిగ్బంధనం, భారీ ర్యాలీలు ఇవన్నీ దానివల్ల సాధ్యమయ్యాయి. తాజాగా ఈ ఉద్యమం గురించి అన్ని జిల్లాల ప్రజలను చైతన్యం చేసేందుకు అమరావతి పరిరక్షణ సమితి ఉద్యమ బస్సు యాత్ర ప్లాన్ చేసింది. 

విజయవాడ నుంచి ఈరోజు మొదలుకావాల్సిన జేఏసీ బస్సు యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. ఆర్టీఏ నుంచి అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పినా పోలీసు పర్మిషను లేదని వారు అడ్డుకున్నారు. దీంతో బస్సులు షెడ్లోనే ఉండిపోయాయి. వాస్తవానికి ఇది జేఏసీ చేస్తున్న బస్సు యాత్ర. ఆందోళన కూడా కాదు. కాబట్టి దీనికి పోలీసు పర్మిషను అవసరం లేదు. అయినా పోలీసులు అడ్డుకున్నారు అని జేఏసీ నేతలు మండిపడ్డారు. వాస్తవానికి ఈ బస్సు యాత్ర రాష్ట్రంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాల్లోను సాగాల్సి ఉంది. అది జరిగితే.. ఉద్యమం మరింత తీవ్రరూపం దాలుస్తుందని భావించిన ప్రభుత్వం ఉద్యమాన్ని అణచివేసే  ప్రయత్నం చేసింది. పోలీసులను ఈ స్థాయిలో మొహరిస్తున్నారు అంటే ఉద్యమ సెగ ప్రభుత్వానికి గట్టిగా తగిలిందనే అనుకోవాలి.  శాంతియుతంగా సాగుతున్న ఉద్యమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వానికి ఏ హక్కు లేకపోవడంతో్ ఇలా అవసరం లేని పర్మిషన్ల పేరు చెప్పి ఉద్యమాన్ని అణచివేస్తోంది ప్రభుత్వం. 

Read Also

జగన్‌కు గిఫ్టు పంపిన టీడీపీ నేత.. ఏంటో తెలుసా?
రాజధాని అమరావతి పరిరక్షణ సమితి జెఏసికి ఎకరం భూమి విరాళం
అమరావతి ఉద్యమం ఇలా అయితే ఎలా?