ఆమె ను సెక్సీ చూపించడానికే సినిమా తీశావా వర్మ?

May 26, 2020

ఎదుటి వాడి అభిప్రాయంతో, వేదనతో గాని, ప్రేమతో గాని ఎటువంటి ఎమోషనల్ కనెక్షన్ పెట్టుకోకుండా తనకు నచ్చినట్లు మాట్లాడి, నచ్చినట్లు బతికే వ్యక్తి వర్మ. దేన్నయినా తన కోణంలో చూసి చెడగొట్టేందుకు రెడీగా ఉంటాడు. ప్రపంచంలో అనేక మార్షల్ ఆర్ట్స్ సినిమాలు వచ్చాయి. వర్మ తాజాగా తీస్తున్న ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ అనే సినిమా తొలి ఇండియన్ మార్షల్ ఆర్ట్స్ సినిమా అని చెప్పుకుంటున్నాడు వర్మ. ఇక పోతే ఈ ట్రైలర్ లో బ్రూస్ లీ గురించి గాని, లేడీ బ్రూస్ లీ అయిన అమ్మాయి గురించి ఆలోచించే అవకాశం ఇవ్వకుండా ఆ అమ్మాయి ఎద సంపదను, తొడలను వీలైనంత సెక్సీగా చూపించడానికి ఈ ట్రైలర్ ను ఎక్కువగా వాడుకున్నారు వర్మ. పబ్లిసిటీ కి పిచ్చెక్కించే వర్మ తాజాగా విడుదల చేసిన ఈ ట్రైలర్ ఇంటర్నెట్ ను ఊపేస్తోంది. 

పూజ భాలేకర్ ప్రధాన పాత్రలో వస్తున్న ఈ సినిమా వర్మ తీసిన మరో  హాట్ ఫిలింగా మిగిలిపోతుందా? లేదా ప్రేక్షకులను మెప్పిస్తుందా అన్నది చూడాలి. మూడు నిమిషాల ఈ ట్రైలర్ ను చూసిన ప్రేక్షకులకు పిచ్చెక్కిపోతోంది. టూ హాట్ గా ఉంది. అమ్మాయి తొడలను చూపించడానికి వర్మ చాలా ఆసక్తికనబరిచారు. అందుకే ప్రేక్షకులు తమదైన శైలిలో వర్మ పట్ల స్పందించారు. కానీ ప్రధాన పాత్ర పోషిస్తున్న పూజ భాలేకర్ కి మాత్రం ఇది చెప్పుకోదగ్గ అవకాశమే. ఆమెకు ఈ ట్రైలర్, సినిమా మరిన్ని అవకాశాలు తెచ్చిపెడుతుంది.