ఆ ఘాటు ముద్దుకు వణికిపోయిందట

May 31, 2020

వెండితెర వేల్పులు.. ప్రజల్లో వారికుండే క్రేజ్ చూసినోళ్లు ఎవరైనా అసూయ పడుతుంటారు. రాజభోగాలు అనుభవిస్తారని అనుకుంటారు. కానీ.. వారెంత కష్టపడతారన్న విషయాన్నిఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఇండస్ట్రీ ఏదైనా కానీ.. వారు చేసే శ్రమకు అంతో ఇంతో పేరు వస్తుంటుంది. కానీ.. సినిమా ఇండస్ట్రీలో హీరోహీరోయిన్లకు మాత్రం ఆ అవకాశం కాస్త తక్కువే. అంతో ఇంతో కొన్నిసార్లు హీరో చేసే కష్టానికి ఫలితం దక్కినా.. హీరోయిన్లు ఎంత కష్టపడినా.. వారికి తగిన పేరు రావటం తక్కువే.
అందచందాల మీద.. వారు ఒలికించే గ్లామర్ రసం మీద ఫోకస్ పెడతారే కానీ.. అలా చేయటం కోసం వారెంత మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారన్న కనీస విషయాన్ని అస్సలు పట్టించుకోరు. తాజాగా ఒక ఇంగ్లిషు మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అందాల భరిణె పూజాహెగ్డే చెప్పిన వివరాల్ని చూసినప్పుడు ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది.
సినిమా చూస్తున్నప్పుడు ముద్దు సన్నివేశాలకు ప్రేక్షకులు ఇట్టే కనెక్ట్ అయిపోతారు. అందులో లీనమైపోతారు. కానీ.. ఆ సీన్ చేస్తున్నప్పుడు హీరోయిన్లు పడే కష్టం అంతా ఇంతా కాదు. తన అనుభవం గురించి చెప్పుకొచ్చిన పూజా.. తన తొలి ముద్దు సన్నివేశం చేసే సమయంలో తనకు వణుకు పుట్టినట్లు చెప్పారు. ముద్దు సన్నివేశాల్లో నటించే సమయంలో తాను చాలా ఇబ్బందికి గురి అవుతుంటానని చెప్పారు.
ఆమె నటించిన భారీ బాలీవుడ్ చిత్రం మొహంజోదారో చిత్రంలో హృతిక్‌ రోషన్‌కు ముద్దుపెట్టిన సీన్‌ను గుర్తు చేసుకుంటూ.. ఆ సన్నివేశం గురించి దర్శకుడు అశుతోష్ గోవారికర్ తనకు వివరించారని.. దీంతో లిప్ లాక్ కు తాను సిద్ధమయ్యానని చెప్పారు. చుట్టూ అంత మంది ముందు సీన్ చేసే సమయానికి తనకు వణుకు వచ్చినట్లు చెప్పారు.
ఆ సీన్ కు ముందు తానెప్పుడు ముద్దు సన్నివేశం చేయకపోవటంతో చాలా ఇబ్బందికి గురయ్యానని.. చుట్టూ చాలామంది ఉన్నప్పుడు అలాంటి సీన్లు చేయటం చాలా కష్టంగా అనిపించినట్లు చెప్పారు. అనుకుంటాం కానీ.. కొన్ని తేలికగా కనిపిస్తాయి కానీ.. అందులో ఉండే కష్టం వివరిస్తే మాత్రమే అర్థమవుతుంటాయి. అలాంటి దానికి నిదర్శనంగా పూజాహెగ్డే చెప్పిన విషయంగా చెప్పక తప్పదు.