హీరోయిన్ రాజకీయం - తెలుగు ఓటర్లకి ప్రశ్న

August 12, 2020

పూనమ్ కౌర్.. చక్కటి వర్చస్సు కలిగిన హీరోయిన్. పెద్ద హీరోయిన్ అవుదామని ప్రయత్నించినా కాలేకపోయింది. అలా అని అవకాశాలు లేకేం లేదు. తెలుగు, తమిళం, మళయాళంలో చాలా సినిమాలు చేసింది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాజాలంతో సినిమాకు పరిచయమైన ఈ 33 ఏళ్ల హీరోయిన్ ఇపుడు టెలివిజన్ ప్రోగ్రాముు చేసుకుంటోంది.

అయితే, కొంతకాలంగా రాజకీయ కామెంట్లు చేయడం మొదలుపెట్టింది. కొందరు పూనమ్ కౌర్ కి పవన్ కి మధ్య ఏదో ఉందని ప్రచారం చేశారు. తర్వాత కొంతకాలం పవన్ అభిమానులకు, పూనమ్ కి ఇంటర్నెట్లో వాగ్వాదాలు నడిచాయి. ఏవేవో రాజకీయ కామెంట్లు చేయడం మొదలుపెట్టింది. 

ఇటీవలే మే 28న ఎన్టీఆర్ పుట్టిన రోజున ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించి అందరికీ షాక్ ఇచ్చింది. మీ లాంటి వారు నేటి రాజకీయాల్లో, సినిమాల్లో అవసరం అంటూ కామెంట్ చేసింది పూనమ్. ఈవిల్స్ తో పోరాడే శక్తిని నాకు ప్రసాదించు... అంటూ పుష్పాంజలి ఘటించింది. అది అపుడు బాగా చర్చకు దారితీసింది.

తాజాగా రోజు రాజకీయాలపై హాట్ కామెంట్లు చేసింది. అవినీతి రాజకీయాలపై ఆమె మాట్లాడింది.

మనం అన్నీ బానే మాట్లాడతాం. అవినీతి గురించి ప్రసంగాలిస్తాం.. కానీ అవినీతి రహిత నేతలకు ఓట్లెందుకు వేయం? 

అంటూ తెలుగు వారందరికీ ప్రశ్న వేసింది. కామెంట్లన్నీ గమనిస్తూ నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అంటూ నిలదీస్తోంది. మరి మీరు చెబుతారా జవాబు?

తెలుగు రాష్ట్రాల్లో కేటీఆర్ ఫాంహౌస్ అని, అచ్చెన్నాయుడు, జగన్ -సాయిరెడ్డి అవినీతి కేసులు ఇవన్నీ హాట్ టాపిక్ లుగా మారిన నేపథ్యంలో వీళ్లందరూ కాదు... మనకు నిజాయితీపరులు కావాలంటూ అంటోంది. మరి ఆమె ఎవరి రాజ్యమేలాలని కోరుకుంటుందో మరి .