పూనం ఇన్‌డైరెక్ట్ పంచ్ ప‌వ‌న్‌కేనా..!

February 23, 2020

ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై హీరోయిన్ పూనం కౌర్ పరోక్షంగా విమర్శలు  వర్షం కురిపించిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల మొదలైన దగ్గర నుంచి సైలెంట్ అయిపోయిన పూనం తాజాగా మరోసారి వార్తల్లో నిలిచింది. ఎవరిని ఉద్దేశించకుండా ట్విట్టర్లో పెట్టిన ఓ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఆ ట్వీట్ పెట్టడంపై పవన్ కళ్యాణ్ అభిమానులు పూనంపై ఫైర్ అవుతున్నారు.
అలా పూనం పవన్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యేలా పెట్టిన ట్వీట్ ఏంటంటే.... `ఓ అబ‌ద్ధాల కోరు రాజ‌కీయ నాయకుడు కాగ‌ల‌డు కానీ.. లీడ‌ర్ కాలేడు` హష్ ట్యాగ్ లో ఓ చిన్న ఆలోచ‌న అంటూ పూనమ్ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్‌లో పూనం ఎవ‌రి పేరునూ ప్ర‌స్తావించలేదు. అయినప్పటికి గతంలో పూనం పవన్‌పై చేసిన విమర్శలని దృష్టిలో పెట్టుకుని ప‌వ‌న్ ఫ్యాన్స్ ఇప్పుడు ఆమెపై ఫైర్ అవుతున్నారు.
త‌మ హీరోని దృష్టిలో పెట్టుకునే పూన‌మ్ ఈ ట్వీట్ చేసిదంటూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. దీంతో ఈ ట్వీట్ కూడా బాగా వైరల్ అయిపోయింది.
కాగా, ఎన్నికలకు ముందు ఆమె పవన్ పై ప‌రోక్షంగా తీవ్ర విమర్శలు చేసింది. పరోక్షంగా పవన్ అమ్మాయిలని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేశాడని సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పించింది. “కాన్సెప్ట్స్ కాపీ చేసి, డైలాగ్స్ కాపీ చేసి, బట్టలు మార్చుకుంటూ, మనుషులను మారుస్తూ, మాట మీద ఉండకపోవడం, జనాలు ఇన్నోసెన్స్ తో ఆడుకుంటూ.. వేష భాషలు మారుస్తూ జనాల్ని మభ్యపెట్టి అమ్మాయిలని అడ్డంపెట్టుకుంటూ రాజకీయాలు చేస్తున్నారు కొంతమంది. ఆ భగవంతుడే నిజం ఏంటో అని తెలిపించాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నా” అంటూ ఫేస్ బుక్‌లో ఆమె పెట్టిన పోస్ట్ పెద్ద సంచలనమే అయింది. అప్పుడు కూడా పవన్ ఫ్యాన్స్ ఆమెపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కూడా. మళ్ళీ అప్పటి నుంచి సైలెంట్‌గా ఉన్న పూనం...ఇప్పుడు మళ్ళీ రియాక్ట్ అయింది.