బ్రా తీసేసి... పాకిస్తాన్ ను బెదిరించింది

August 03, 2020

త‌న ట్వీట్ల‌తో త‌ర‌చూ వార్త‌ల్లో నిలిచే సినీ న‌టి క‌మ్ మోడ‌ల్ పూన‌మ్ పాండే తాజాగా చేసిన పోస్ట్ ఇప్పుడు వైర‌ల్ గా మారింది. ప్ర‌పంచ‌క‌ప్ లో భాగంగా ఆదివారం జ‌రిగే భార‌త్-పాక్ మ‌ధ్య మ్యాచ్ నేప‌థ్యంలో దాయాది దేశంలో ఓవ‌రాక్ష‌న్ అంత‌కంత‌కూ పెరిగిపోతోంది. భార‌త్ ను రెచ్చ‌గొట్టేలా చేసేందుకు వారు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు.
పాక్ యుద్ధ విమానాన్ని కూల్చి భార‌తావ‌ని నీరాజ‌నాలు అందుకున్న భార‌త వాయుసేన వింగ్ క‌మాండ‌ర్ అభినంద‌న్ వ‌ర్ధ‌మాన్ ను అవ‌మానిస్తూ పాక్ మీడియా మీడియా రూపొందించిన యాడ్ పై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ త‌ర‌హా యాడ్ రెండు దేశాల మ‌ధ్య విద్వేషాన్ని రెచ్చ‌గొట్టేలా చేసింది.
ఈ యాడ్ పై భార‌త అభిమానుల‌తో పాటు.. భార‌త టెన్నిస్ ప్లేయ‌ర్.. పాక్ క్రికెట‌ర్ షోయ‌బ్ స‌తీమ‌ణి సానియా మీర్జా మండిప‌డ్డారు మ‌తి లేని ప్ర‌క‌ట‌న‌ల‌తో మితిమీరిన ప్ర‌చారం అక్క‌ర్లేదంటూ చివాట్లు పెట్టింది. ఇలా యాడ్ మీద విమ‌ర్శ‌లు తీవ్ర‌మ‌వుతున్న వేళ‌.. పూన‌మ్ పాండే ఊహించ‌ని రీతిలో రియాక్ట్ అయ్యారు.
ఇన్ స్టాగ్రామ్ వేదిక‌గా త‌న ఆగ్ర‌హాన్ని వెళ్ల‌గ‌క్కుతూ.. తాను నిన్న‌నే పాక్ యాడ్ చూశాన‌ని.. ఒక హీరో చేసిన ప‌నిని వాళ్లు ఎలా చుల‌క‌న చేస్తారు? అని ప్ర‌శ్నించారు. పాకిస్థాన్ కు ఇది మంచిది కాద‌న్న ఆమె.. ఆ యాడ్ కు త‌న స‌మాధానం ఏమిటో చెప్పేశారు.
టీ క‌ప్పుల‌పై సెటైర్లు ఎందుకు? మీకు కావాల్సింది ఈ క‌ప్ అంటే త‌న లోదుస్తుల్ని చూపిస్తూ.. డ‌బుల్ క‌ప్ అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ఈ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పూన‌మ్ రియాక్ష‌న్ ను కొంద‌రు ఓకే చెబుతుంటే.. ఈ తీరులో చెప్ప‌టం స‌రికాద‌న్న మాట మ‌రికొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు.