ఇవన్నీ తెలుసుగా... ఒకసారి గుర్తుచేసుకుందామా?

August 08, 2020

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల సంక్రమించే కోవిడ్-19 వల్ల లక్షలాది ప్రజలు మరణించారు. ఈ మాయదారి వైరస్ ను కట్టడి చేసేందుకు చాలా దేశాలతో పాటు భారత్ కూడా లాక్ డౌన్ విధానాన్ని అమలు చేసింది. మార్చి 25 నుంచి మే 31 వరకు మొత్తం నాలుగు లాక్ డౌన్ లు విధించింది. తొలి విడత లాక్ డౌన్ తో పోల్చుకుంటే ప్రస్తుతం అమలులో ఉన్న నాలుగో విడత లాక్ డౌన్ లో సడలింపులు ఎక్కువగానే ఇచ్చారు. రెడ్, కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా జోన్లలో ప్రజా రవాణా, ప్రైవేటు వాహనాల అనుమతి వంటి కొన్ని విషయాలపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని కేంద్రం సూచించింది. లాక్ డౌన్ సడలింపులు,వేటికి అనుమలుతున్నాయి వేటికి లేవు అన్న అంశాలపై ప్రత్యేక కథనం.

Latest coronavirus news  
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 213 దేశాలకు పాకింది. ప్రపంచవ్యాప్తంగా 47,17,038 మంది కరోనా బారిన పడ్డారు. కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 3,12,384 మందిని బలి తీసుకుంది.

lockdown news  
కరోనాను కట్టడి చేసేందుకు చాలా ప్రపంచ దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. కేసుల తీవ్రతను బట్టి లాక్ డౌన్ ను ఆయా దేశాలు ఎత్తివేస్తున్నాయి. ప్రస్తుతం భారత్ లో లాక్ డౌన్ 4.0 అమలులో ఉంది.

lockdown extension
భారత్ లో లాక్ డౌన్ కొనసాగిస్తూ లాక్ డౌన్ 4.0 విధించారు. లాక్ డౌన్ 1.0 తో పోలిస్తే లాక్ డౌన్ 4.0లో మరిన్ని సడలింపులిచ్చింది కేంద్రం. కొన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలకు అనుమతులిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

guidelines for lockdown
ఈసారి జోన్ల ఏర్పాటు, ప్రకటనలపై నిర్ణయాధికారాన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇచ్చారు. కరోనా కేసుల ఆధారంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్ల ఏర్పాటు చేసుకోవడమే కాదు, వాటిలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించుకోవాలో రాష్ట్రాలే నిర్ణయించుకోవచ్చు. 65 ఏళ్లకు పైబడిన వాళ్లు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు, గర్భవతులు, 10 ఏళ్ల లోపు పిల్లలు ఇంటివద్దే ఉండాలని సూచించారు
 
containment zone  

కంటైన్మెంట్ జోన్లలో మినహా మిగిలిన ప్రాంతాల్లో ఆఫీసులు, పరిశ్రమలు తగిన జాగ్రత్తలతో నిర్వహించుకునే వెసులుబాటు కల్పించారు.  

E-pass for lockdown  

లాక్ డౌన్ 4.0 లో భాగంగా రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమలులో ఉంటుంది. లాక్ డౌన్ సమయంలో అనుమతులు లేని రంగాల వారు బయటకు వెళ్లాలనుకుంటే వారి కోసం ఆయా పోలీసు శాఖలు ఈ పాస్ లు జారీ చేస్తున్నాయి.  

COVID warriors

కరోనాపై పోరులో డాక్టర్లు, వైద్య సిబ్బంది, నర్సులు, పారామెడికల్ స్టాఫ్....పోలీసులు, పారిశుధ్య సిబ్బంది వీరందరినీ కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటారు. రెవెన్యూ సిబ్బంది, జర్నలిస్టులు ....వీరంతా కోవిడ్ వారియర్స్.

Coronavirus helpers  
కరోనాను కట్టడి చేసేందుకు  డాక్టర్లు, వైద్య సిబ్బంది, నర్సులు, పారామెడికల్ స్టాఫ్....పోలీసులు, పారిశుధ్య సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. వీరంతా కరోనాపై పోరులో కరోనా హెల్పర్స్ గా  ప్రజలకు సాయం చేస్తున్నారు.

coronavirus tips  

కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు.ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ లేదా సబ్బు మరియు నీటిని ఉపయోగించి తరచుగా చేతులను కడుక్కోవడం ద్వారా చేతులపై ఉన్న వైరస్‌లు చనిపోతాయి. దగ్గుతున్న లేదంటే తుమ్మతున్న వారి నుండి కనీసం 1 మీటర్ (3 అడుగుల) దూరంలో ఉండండి. మీరు మరియు మీ చుట్టూ ఉన్నవారు పరిశుభ్రత పాటించేటట్లు చూసుకోండి. దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు మోచేతిని లేదా టిష్యూ పేపర్‌ను అడ్డుపెట్టుకోవడం. తరువాత టిష్యూ పేపర్‌ను క్లోజ్ చేసే వీలున్న డస్ట్‌బిన్‌లో వెయ్యండి. మీకు జ్వరం, దగ్గు మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే డాక్టర్‌ను వెంటనే సంప్రదించండి. లక్షణాలు గుర్తించిన వెంటనే, లేదా లక్షణాలు లేకుండానే కోవిడ్-19 సోకిందేమో అన్న అనుమానం ఉన్న వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు. ప్రభుత్వ అనుమతితో వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వారు తప్పకుండా హోమ్ క్వారంటైన్ పాటించడం ద్వారా కూడా ఇతరులకు వైరస్ సోకకుండా నివారించవచ్చు.

 
corona update in India    

మే 18 నాటికి భారత్ లో 96,169 మందికి కరోనా సోకగా... 3,029 మంది మరణించారు.
 
India COVID-19 tracker

భారత్ లో మే 17 నుంచి మే 18 వరకు (24 గంటల్లో) 5,242 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇండియాలో ఒక్కరోజులో ఇన్ని కేసులు రావడం ఇదే తొలిసారి. ఇండియాలో నేటితో కరోనా కేసులు లక్షను దాటే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటివరకూ 36,824 మంది కరోనా నుంచి కోలుకోగా, దేశవ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో 56,316 మంది చికిత్సను పొందుతున్నారు. మొత్తం 3,029 మంది మరణించారు.  

Covid-19 tracker    
కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 213 దేశాలకు పాకినట్టు గుర్తించారు. ఇప్పటివరకు 47,17,038 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, 3,12,384 మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచం మొత్తమ్మీద చికిత్స పొందుతున్న వారి సంఖ్య 25,94,555. ఇక, 18,10,099 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. అత్యధికంగా అమెరికాలో ఈ వైరస్ ధాటికి 89,595 మంది మరణించారు.

china coronavirus  

చైనాలోని వూహాన్ నగరంలోని ల్యాబ్ లలోనే కరోనాను పెంచి పోషించారని, అది లీక్ అయి, ఇలా ప్రపంచాన్ని పట్టుకుందని పలు దేశాలు ఆరోపిస్తున్నాయి. ఇది చైనా వైరస్ అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్ర విమర్శలు చేశారు.
కరోనా వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయమై నిష్పాక్షిక విచారణ జరపాలని భారత్ సహా 61 దేశాలు కోరుతున్నాయి.